టాలీవుడ్ నుండి సంక్రాంతి బరిలో మూడు సినిమాలు నిలువగా అందులో మొదటగా గేమ్ ఛేంజర్ ఈరోజు విడుదలై పాజిటివ్ రివ్యూస్ ను సొంతం చేసుకుంది. ఇక నెక్స్ట్ బాలకృష్ణ డాకు మహారాజ్ రానుంది.బాబీ ఈసినిమాను డైరెక్ట్ చేశాడు.ఇప్పటికే విడుదలైన సాంగ్స్ ,ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడం తో సినిమాకు భారీ హైప్ వచ్చింది.ఇక ఈరోజు మరో ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ రిలీజ్ ట్రైలర్ ,ఫస్ట్ ట్రైలర్ ను మించి వుంది.యాక్షన్ ప్యాక్డ్ వచ్చిన ఈ ట్రైలర్ సినిమా పై అంచనాలను మరింతగా పెంచేసింది.ట్రైలర్ లో బాలకృష్ణ స్క్రీన్ ప్రజెన్స్ , డైలాగ్స్ , విజువల్స్ , బీజీఎమ్ హైలైట్ అయ్యాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రమోషన్స్ లో భాగంగా రిలీజ్ కు ముందు భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపుదామనుకున్నారు కానీ కుదరలేదు.ఇక ఆంధ్రా లో టికెట్ హైక్ ,ఎక్స్ట్రా షోస్ విడుదలకానుంది. ఆల్రెడీ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. తెలంగాణ లో ఓపెన్ కావాల్సివుంది.ఈరాత్రి ఓపెన్ చేసేలా వున్నారు. ఈ సినిమాలో శ్రద్దా శ్రీనాథ్ , ప్రగ్యా జైస్వాల్ ,చాందిని చౌదరి కీలక పాత్రల్లో నటించగా బాబీ డియోల్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.తమన్ సంగీతం అందించగా సాయి సౌజన్య , నాగవంశీ ఈసినిమాను నిర్మించారు.జనవరి 12 న ఈసినిమా విడుదలకానుంది.
ఇక బాలకృష్ణ కు సంక్రాంతి సీజన్ బాగా కలిసొచ్చింది. ఈ సీజన్ లో వచ్చిన తన సినిమాలు అన్ని దాదాపుగా విజయాలు సాధించాయి.ఈసెంటిమెంట్ కు తోడు అఖండ 2 నుండి వరుస హిట్లతో ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో వున్నాడు బాలకృష్ణ. మరి డాకు మహారాజ్ తో తన విజయపరంపర కొనసాగిస్తాడో చూడాలి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























