ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మనందానికి గుండెకు సంబంధించిన ఆపరేషన్ జరిగిన సంగతి తెలిసిందే. ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి వెళ్లిన ఆయనకు సర్జరీ చేయాలని వైద్యులు సూచించగా దేశంలోనే అత్యుత్తమైన ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇనిస్టిట్యూట్ లో బ్రహ్మనందం ఆపరేషన్ జరిగింది. ప్రముఖ డాక్టర్ రమాకాంత్ పాండా బ్రహ్మానందంకు సర్జరీ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ వార్త సోషల్ మీడియా వల్ల అందరికీ తెలిసిపోయింది. దీంతో బ్రహ్మానందం కు ఆపరేషన్ జరిగిన నేపథ్యంలో పలువురు ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే బ్రహ్మనందం ఆరోగ్యం విషమంగా ఉందన్న వార్తలు కూడా వచ్చాయి. దీంతో దీనిపై బ్రహ్మీ కుటుంబసభ్యులు కూడా స్పందించి క్లారిటీ ఇచ్చారు. తన తండ్రి ఆపరేషన్ పై కొడుగు గౌతమ్ స్పందిస్తూ..సర్జరీ విజయవంతమైంది..ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది.. ఆయన ఇంకా హాస్పిటల్ లోనే ఉండటం వల్ల సన్నిహితులు, అభిమానులు కలవరపడ్డారు.. ప్రస్తుతం ఐసీయూ నుండి నార్మల్ రూమ్ కు షిప్ట్ చేశారని తెలిపారు.
కాగా కామెడీ అంటే మొదట గుర్తొచ్చేది బ్రహ్మానందమే. అలా వెయ్యికి పైగా చిత్రాల్లో హాస్యపాత్రలు ధరించిన బ్రహ్మనందం గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. మరి ఆయన త్వరగా కోలుకోవాలని మనం కూడా ఆశిద్దాం..
[youtube_video videoid=ISSJx9e4em0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























