‘ఆర్ఆర్ఆర్’ మూవీతో గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు పొందారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. దీని తరువాత ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘గేమ్ ఛేంజర్’. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్. శంకర్ దర్శకత్వంలో పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించగా.. ఎస్.జె. సూర్య, శ్రీకాంత్, కిక్ శ్యామ్, సముద్రఖని, సునీల్, అంజలి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకువస్తోంది. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించిన ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదలకానుంది.
ఈ నేపథ్యంలో హీరో రామ్ చరణ్‌పై ప్రత్యేక కథనం..
టాలీవుడ్ అగ్ర హీరో మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో 2007లో వచ్చిన ‘చిరుత’ చిత్రంతో తెరంగేట్రం చేసిన ఆయన.. తొలి సినిమాతోనే మంచి నటనను కనబరిచి ఆకట్టుకున్నాడు. ఈ చిత్రం ఘనవిజయం సాధించడంతో పాటు చరణ్ లోని ట్యాలెంట్‌ను ప్రేక్షకులకు పరిచయం చేసింది. ముఖ్యంగా ఫైట్స్, డ్యాన్స్‌ల్లో తన ఈజ్ చూపించి తండ్రికి తగ్గ వారసుడు అనిపించుకున్నాడు.
ఇక దీని తర్వాత వచ్చిన ‘మగధీర’ సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు రామ్ చరణ్. దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సోషియో ఫాంటసీ మూవీ అత్యధిక వసూళ్లతో టాలీవుడ్‌లో అప్పటివరకూ ఉన్న రికార్డులను తుడిచిపెట్టేసింది. దీంతో రెండో సినిమాతోనే చరణ్ స్టార్‌డమ్ సొంతం చేసుకున్నాడు. ప్రధానంగా ఈ చిత్రంలో గుర్రపు స్వారీ సన్నివేశాలలో తన అసాధారణ నైపుణ్యంతో ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేశాడు.
ఇక్కడినుంచి రామ్ చరణ్ ప్రస్థానం శరవేగంగా కొనసాగింది. హిట్స్, ప్లాప్స్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ క్రమంలో ‘ఆరెంజ్, గోవిందుడు అందరివాడేలే’ వంటి ప్రయోగాత్మక మరియు కుటంబ కథా చిత్రాలతో తన ప్రత్యేకతను చాటుకున్నాడు చరణ్. అలాగే మధ్యలో ‘ఎవడు, నాయక్’ వంటి పక్కా మాస్ కమర్షియల్ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు. తద్వారా ఎలాంటి టిపికల్ క్యారక్టర్ అయినా చేయగలడని చరణ్ నిరూపించుకున్నాడు.
ఈ తరుణంలో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ రూపొందించిన ‘రంగస్థలం’ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టాడు రామ్ చరణ్. ఈ సినిమా అప్పటివరకూ చరణ్‌కి ఉన్న ఇమేజ్‌ను సంపూర్ణంగా మార్చేసింది. పక్కా పల్లెటూరి యువకుడిగా కనిపించి అందరినీ సర్‌ప్రైజ్ చేశాడు. అంతేకాకుండా బధిరుడిగా నటించి ఆశ్చర్యపరిచాడు. ఒక స్టార్ హీరో ఇలాంటి వైకల్యం ఉన్న పాత్రలో నటించడం అనేది చాలా అరుదైన విషయం. అయితే అలాంటి పాత్రలో అవలీలగా పరకాయప్రవేశం చేసి మెప్పించాడు చరణ్.
ఇక ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో గ్లోబల్ వైడ్‌గా పాపులర్ అయ్యాడు. మరో స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి మల్టీస్టారర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో సీతారామరాజు అనే హిస్టారికల్ క్యారక్టర్‌లో స్వాతంత్య్ర సమరయోధుడిగా కనిపించాడు. ఈ మూవీ దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో బాక్సాఫీస్ వద్ద 1,200 కోట్ల వసూళ్లతో అనేక రికార్డులు సృష్టించింది. అలాగే పలు ఇంటర్నేషనల్ అవార్డ్స్ గెలుచుకుంది.
ఈ చిత్రంలో ఎన్టీఆర్‌తో కలిసి చరణ్ వేసిన స్టెప్స్ ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమందిని ఉర్రూతలూగించాయి. ముఖ్యంగా ‘నాటు నాటు’ పాటలో వీరి డ్యాన్స్ సెన్సేషన్ అయింది. సోషల్ మీడియాలలో ఈ పాటలోని స్టెప్స్ వేస్తూ వేలాదిమంది రీల్స్ చేయడం విశేషం. అలాగే ఈ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ సహా విశిష్ట ఆస్కార్ అవార్డును కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది.
ఇలా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో రామ్ చరణ్ పేరు దేశ,విదేశాలలో మారుమ్రోగిపోయింది. పలువురు హాలీవుడ్ ప్రముఖులు చరణ్ నటనపై ప్రశంసలు కురిపించారు. మరికొందరు మూవీ లవర్స్ అయితే ఏకంగా ‘జేమ్స్ బాండ్’ తదుపరి సినిమాలలో హీరోగా చరణ్‌ను తీసుకోవాలని మేకర్స్‌కు సూచించారు. మరోవైపు ఆస్కార్ యాక్టర్స్ కమిటీలో ఎన్టీఆర్‌తో పాటు చరణ్ చోటు దక్కించుకోవడం విశేషం. ఈసారి ఆస్కార్ అవార్డుల ఎంపిక ప్రక్రియలో కీలకమైన నామినేషన్స్‌లో ఓటు వేసే అవకాశం పొందాడు.
ఈ నేపథ్యంలో రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ తర్వాత కథానాయకుడిగా చేస్తోన్న చిత్రం కావడం, దాదాపు ఆరేళ్ళ తర్వాత సోలో హీరోగా వస్తుండటంతో ‘గేమ్ ఛేంజర్’ మూవీపై ఇటు పరిశ్రమలో, అటు మెగా అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనికితోడు ఈ సినిమాకు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్. శంకర్ దర్శకత్వం వహించడం, పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కడంతో సాధారణ ప్రేక్షకుల్లో సైతం విపరీతమైన ఆసక్తి నెలకొంది. అలాగే ఈ చిత్రంలో చరణ్ డ్యూయల్ రోల్స్ పోషిస్తుండటంతో మరింత క్యూరియాసిటీ ఏర్పడింది.
అయితే తన ఫ్యామిలీలో తండ్రి చిరంజీవి ఒక మెగాస్టార్. బాబాయి పవన్ కళ్యాణ్ ఒక పవర్ స్టార్, ఇంకా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి. మరో బాబాయి ప్రముఖ నిర్మాత. ఇంతటి ఘనమైన చరిత్ర కలిగిన కుటుంబం నుంచి వచ్చినా.. స్వయంకృషితో తనదైన ట్యాలెంట్‌తో చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న రామ్ చరణ్.. నిజమైన గేమ్ ఛేంజర్ అని చెప్పొచ్చు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























