నేడే గేమ్ ఛేంజర్ మెగా పవర్ ఈవెంట్.. భారీగా ఏర్పాట్లు

Game Changer All Set For Mega Power Event of Global Star Ram Charan

గ్లోబల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా, కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ ఎస్. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వహించిన లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయికగా నటించగా.. ఎస్.జె. సూర్య, శ్రీకాంత్, కిక్ శ్యామ్, సముద్రఖని, సునీల్, అంజలి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. వచ్చే సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించిన ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదలకానుంది.

విడుదల తేదీ దగ్గరపడిన నేపథ్యంలో మేకర్స్ మూవీ ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ వేడుకను మెగా పవర్ ఈవెంట్‌ పేరుతో ఈరోజు ఆంధ్రాలో గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారు మేకర్స్. ఈ ఈవెంట్‌కు తూ.గో.జిల్లా కడియం మండలం వేమగిరి వేదిక కానుంది. ఇక ఈ వేడుకకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరుకానుండటం విశేషం. దీంతో మెగా అభిమానులు ఈ వేడుకకు పోటెత్తడం ఖాయంగా కనిపిస్తోంది.

అయితే శనివారం సాయంత్రం 6 గంటల నుంచి వేమగిరి జాతీయ రహదారి పక్కనున్న లే-అవుట్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రారంభం కానున్న క్రమంలో నిర్వాహకులు భారీ ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు లక్ష మంది అభిమానులు తరలివచ్చే అవకాశం ఉందని అంచనా. దీంతో నిర్వాహకులు, స్థానిక అధికారుల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ కార్యక్రమానికి హీరో రామ్ చరణ్, హీరోయిన్ కియారా అద్వానీ, దర్శకుడు శంకర్, ప్రొడ్యూసర్ దిల్ రాజు సహా మూవీ టీమ్ అంతా వస్తుండడంతో మెగా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.