ఇప్పటి వరకు మేం చూపింది కేవలం యాభై శాతమే

Producer Dil Raju Interesting Comments on Directors Shankar and SS Rajamouli

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజ‌ర్‌’. స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ భారీ బ‌డ్జెట్ చిత్రంలో చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ పాన్ ఇండియా మూవీని నిర్మించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 10న తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో గేమ్ చేంజ‌ర్ విడుద‌ల‌వుతోంది. ఇప్ప‌టికే విడుద‌లైన సాంగ్స్‌, టీజ‌ర్‌, ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌తో సినిమాపై అంచ‌నాలు ఆకాశాన్నంటాయి. ఈ అంచ‌నాల‌ను మ‌రింత పెంచేలా తాజాగా ‘గేమ్ ఛేంజ‌ర్‌’ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసిన విషయం తెలిసిందే. ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి చేతుల మీదుగా ఈ ట్రైల‌ర్ విడుద‌ల కావ‌టం విశేషం.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. “తమిళ్ సినిమాను శంకర్ గారు పాన్ ఇండియాగా చేశారు. రాజమౌళి గారు తెలుగు సినిమాను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లారు. ఆ ఇద్దరి వల్లే ఇప్పుడు ఇలాంటి భారీ చిత్రాలు వస్తున్నాయి. డల్లాస్ ఈవెంట్‌లో చాలా మాట్లాడాం. ఇంకా నాలుగో తేదీన చాలా మాట్లాడాల్సి ఉంది. శంకర్ గారు ఇప్పటి వరకు చేసినదంతా మెల్లిమెల్లిగా రివీల్ చేస్తూ వస్తున్నాం.”

“ఇప్పుడు ట్రైలర్‌ను రిలీజ్ చేశాం. ఇప్పటి వరకు మేం చూపింది కేవలం యాభై శాతమే. అసలు మ్యాటర్ ఏంటో జనవరి 10న తెలుస్తుంది. సినిమా అన్ ప్రిడిక్టబుల్‌గా ఉంటుంది. ఇదొక గొప్ప సినిమా కానుంది. ఆర్ఆర్ఆర్ తరువాత గ్లోబల్ స్టార్‌ రామ్ చరణ్‌తో సినిమా అంటే ఎలా ఉండాలో అలానే ఉంటుంది. పెట్టిన దాని కంటే ఎక్కువ లాభాలు రాబోతోన్నాయి” అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.