గేమ్ ఛేంజర్ ట్రైలర్ లాంచ్‌ నేడే.. హాజరుకానున్న రాజమౌళి

Director SS Rajamouli To Attend Game Changer Trailer Launch Event Today

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించిన ఈ చిత్రంలో గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ రెండు ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌ల్లో మెప్పించ‌నున్నారు. ఆయన సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మించగా.. హ‌ర్షిత్ స‌హ నిర్మాత‌గా ఉన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఈ మూవీ జ‌న‌వ‌రి 10న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా గేమ్ ఛేంజర్ నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ అందింది. ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని ‘యు/ఎ’ స‌ర్టిఫికేట్‌ను పొందింది. గ్లోబ‌ల్ రేంజ్ ఇమేజ్ ఉన్న రామ్ చ‌ర‌ణ్‌తో లార్జ‌ర్ దేన్ లైఫ్ సినిమాల‌ను రూపొందించే శంక‌ర్ కల‌యిక‌లో రాబోతున్న ఎలా ఉండ‌బోతుంద‌నే విష‌యం అంద‌రిలోనూ ఎగ్జ‌యిట్‌మెంట్‌ను పెంచుతోంది.

మెగాభిమానులు, సినీ ప్రేక్ష‌కులు సినిమాను ఎప్పుడెప్పుడు థియేట‌ర్స్‌లో చూద్దామా అని ఎదురు చూస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన గేమ్ ఛేంజర్ టీజ‌ర్‌, నాలుగు సాంగ్స్‌, వాటి మేకింగ్ చూస్తే వావ్ అనిపిస్తోంది. సినిమాపై ఉన్న అంచ‌నాలు ఆకాశానంటుతున్నాయి. సినిమా సెన్సార్ పూర్తి కావ‌టం.. సినిమాకు వ‌స్తోన్న పాజిటివ్ ఫీడ్ బ్యాక్‌తో గేమ్ ఛేంజర్ చిత్ర యూనిట్ మ‌రింత ఉత్సాహంగా సంక్రాంతి బ‌రిలోకి దిగుతోంది.

ఈ నేపథ్యంలో నేడు గేమ్ ఛేంజర్‌ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు మేకర్స్. అయితే ఈ కార్యక్రమానికి దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారు. ఈరోజు సాయంత్రం గచ్చిబౌలి లోని ఏఎంబీ మాల్ వేదికగా జరుగనున్న ఈ ఈవెంట్‌లో తెలుగు సహా తమిళం, హిందీ భాషల్లో ఒకేసారి యూ ట్యూబ్ లో గేమ్ ఛేంజర్ ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు.

ఇక ఈ సినిమాకు ఎస్‌.యు.వెంక‌టేశ‌న్‌, వివేక్ రైట‌ర్స్‌గా వ‌ర్క్ చేశారు. ఎస్‌.తిరుణ్ణావుక్క‌ర‌సు సినిమాటోగ్ర‌ఫీ, ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందిస్తుండ‌గా సాయి మాధ‌వ్ బుర్రా డైలాగ్స్ రాశారు. న‌ర‌సింహా రావు.ఎన్, ఎస్‌.కె.జ‌బీర్‌ లైన్ ప్రొడ్యూస‌ర్‌గా బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు. ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా అవినాష్ కొల్ల‌, యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్స్‌గా అన్బ‌రివు, డాన్స్ డైరెక్ట‌ర్‌గా ప్ర‌భుదేవా, గ‌ణేష్ ఆచార్య‌, ప్రేమ్ రక్షిత్‌, బాస్కో మార్టిస్, జానీ, శాండీ వ‌ర్క్ చేస్తున్నారు. రామ్ జోగ‌య్య శాస్త్రి, అనంత్ శ్రీరామ్‌, కాసర్ల శ్యామ్ పాట‌ల‌ను రాశారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.