పుష్ప 2.. హిందీలో తొలి సినిమాగా రికార్డ్

Pushpa 2 Becomes The First Ever Film To Collect Rs700 Cr in Hindi

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌, బ్రిలియంట్‌ దర్శకుడు సుకుమార్‌ల లేటెస్ట్ ఫిల్మ్ ‘పుష్ప-2 ది రూల్‌’. మైత్రీ మూవీమేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్‌ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ అనిపించుకుంది. విడుదలకు ముందే ప్రీరిలీజ్‌ బిజినెస్‌లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం రిలీజ్ రోజు నుంచే వసూళ్లలో ఇండియా ఆల్‌టైమ్‌ రికార్డులు సృష్టిస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ముఖ్యంగా ఇండియాలో ఈ చిత్రం సృష్టించిన రికార్డుల పరంపరకు ఆకాశమే హద్దుగా ఉంది. కేవలం ఆరు రోజుల్లోనే రూ.1,000 కోట్లు వసూలు ఇండియన్‌ సినిమా చరిత్రలోనే అత్యంత వేగవంతంగా ఈ మార్క్ అందుకున్న తొలి చిత్రంగా సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఈ క్రమంలో తాజాగా మరో సరికొత్త రికార్డును నెలకొల్పింది పుష్ప 2.

ఈ నేపథ్యంలో తాజాగా హిందీలో అత్యధిక వసూళ్లు అందుకున్న తొలి చిత్రంగా పుష్ప 2 నిలిచింది. తాజాగా అందిన సమాచారం ప్రకారం, ఈ సినిమా రూ.704.25 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. తద్వారా ఈ మైలురాయిని చేరుకున్న మొదటి సినిమాగా పుష్ప 2 రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు ఏ సినిమా కూడా ఈ మార్క్‌ను టచ్ చేయలేదు.

దాంతో హిందీలో ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్‌ను రాబట్టిన సినిమాగా పుష్ప 2 రికార్డు సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే ఇప్పటివరకు పుష్ప 2 మూవీ 1,600కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. సంక్రాంతి వరకు సినిమాలు లేకపోవడం 56 రోజుల తరువాతే ఓటిటి లోకి వచ్చే ఛాన్స్ ఉండడంతో లాంగ్ రన్‌లో ఈ చిత్రం కళ్ళు చెదిరే లాభాలను కళ్లజూడనుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.