కెజియఫ్ 1&2 తో నేషన్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్.ఈసినిమాలతో హీరోల ఎలివేషన్ సీన్లకు సెపరేట్ స్టైల్ క్రీయేట్ చేశాడు.ఇక ఈసినిమా తరువాత ప్రశాంత్ నీల్ తెలుగు హీరోల తో సినిమాలకు కమిట్ అయ్యాడు.అందులో భాగంగా ప్రభాస్ తో సలార్ తెరకెక్కించాడు.గత ఏడాది వచ్చిన ఈసినిమా ప్రభాస్ ఫ్యాన్స్ ఆకలి తీర్చింది.బాక్సాఫీస్ పరంగా కూడా సూపర్ హిట్ అనిపించుకుంది.ఇందులో ప్రభాస్ ను ప్రశాంత్ నీల్ ఓ రేంజ్ లో చూపెట్టాడు. అయితే సరైన సమయంలో రిలీజ్ అయ్యి ఉంటే 1000కోట్లు కొల్లగొట్టే స్టామినా వున్న సినిమా ఇది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా పూర్తి స్థాయిలో సంతృప్తి పరచలేదు అని అన్నాడు ప్రశాంత్ నీల్.థియేట్రికల్ అవుట్ ఫుట్ విషయంలో కొంచెం డిస్స్పాయింట్ మెంట్ ఉందని డీప్ గా వెళ్ళలేదు కానీ బెస్ట్ ఇవ్వలేకపోయానని అన్నాడు అయితే సలార్ పార్ట్ 2 మాత్రం అలా జరుగదని రైటింగ్ పరంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో వెల్లడించాడు.ఇప్పటికే ఈసినిమా షూటింగ్ కూడా సార్ట్ అయ్యింది.అయితే ప్రశాంత్ నీల్ కు వున్న కమిట్ మెంట్ వల్ల ఆలస్యం అవ్వనుంది. 2026లో సలార్ 2 థియేటర్లలోకి రానుంది.
ఇక ప్రశాంత్ నీల్ ,ఎన్టీఆర్ తో కూడా సినిమా చేయాల్సివుంది.ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 షూటింగ్ తో బిజీగా ఉండడం తో ఈసినిమా ఆలస్యంగా ప్రారంభం కానుంది.అన్ని కుదిరితే ఫిబ్రవరి లో సెట్స్ మీదకు వెళ్లనుంది.పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా తెరకెక్కనుంది.మైత్రి మూవీ మేకర్స్ ,ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మించనున్నాయి.రిలీజ్ డేట్ కూడా చెప్పేశారు. 2026జనవరి 8న విడుదలకానుంది.ఈసినిమాతోపాటు ప్రశాంత్ నీల్ సమానంగా సలార్ 2 పూర్తి చేయనున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























