గేమ్ చేంజర్‌లో నా కెరీర్‌ బెస్ట్ రోల్‌ చేశాను – అంజలి

Actress Anjali Says, I Played My Career Best Role in Game Changer

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ఎస్.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ జనవరి 10న విడుదల కాబోతోంది. ప‌క్కా ప్ర‌మోష‌న‌ల్ స్ట్రాట‌జీతో సినిమాపై అంచ‌నాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. సంక్రాంతికి రాబోతోన్న ఈ సినిమాను శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గేమ్ చేంజర్ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ రెండు ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌ల్లో మెప్పించ‌నున్నారు. ఇక ఈ మూవీలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఛరిష్మా డ్రీమ్స్ రాజేష్ కల్లెపల్లి ఆధ్వర్యంలో డల్లాస్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్‌ సుకుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.

ఈ సందర్భంగా హీరోయిన్ అంజలి మాట్లాడుతూ.. “ఫస్ట్ టైమ్ ఓ తెలుగు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డ‌ల్లాస్‌లో, అది కూడా ఇంత మంది తెలుగు అభిమానుల మ‌ధ్య‌లో జ‌రుగుతుండ‌టం ఎంతో ఆనందంగా ఉంది. గేమ్ చేంజర్ మూవీలో నేను చేసిన పాత్ర‌.. నా కెరీర్‌లో బెస్ట్ రోల్‌గా నిలిచిపోతుందని నేను గ‌ట్టిగా న‌మ్ముతున్నాను. అంత మంచి రోల్‌ను నాకు రాసిన శంక‌ర్‌ గారికి థాంక్స్‌” అని తెలిపారు.

ఇంకా ఆమె మాట్లాడుతూ.. “దిల్‌ రాజు గారికి, శిరీష్‌ గారికి స్పెష‌ల్ థాంక్స్‌. ఎస్‌వీసీని నా ఫ్యామిలీ ప్రొడ‌క్ష‌న్‌గా భావిస్తుంటాను. సీత‌మ్మ‌ వాకిట్లో సిరిమ‌ల్లెచెట్టు, వ‌కీల్ సాబ్ సినిమాలు చేశాను. ఇప్పుడు గేమ్ చేంజ‌ర్‌తో రాబోతున్నాను. ఈ సినిమాలో రామ్‌ చ‌ర‌ణ్‌ను చాలా కొత్త‌గా చూడ‌బోతున్నారు. అప్ప‌న్న క్యారెక్ట‌ర్‌ను అంద‌రూ బాగా ఎంజాయ్ చేస్తారు’’ అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.