గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ఎస్.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ జనవరి 10న విడుదల కాబోతోంది. పక్కా ప్రమోషనల్ స్ట్రాటజీతో సినిమాపై అంచనాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. సంక్రాంతికి రాబోతోన్న ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్రమైజ్డ్‌గా నిర్మించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
గేమ్ చేంజర్ చిత్రంలో రామ్ చరణ్ రెండు పవర్‌ఫుల్ పాత్రల్లో మెప్పించనున్నారు. ఇక ఈ మూవీలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఛరిష్మా డ్రీమ్స్ రాజేష్ కల్లెపల్లి ఆధ్వర్యంలో డల్లాస్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుకుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఈ కార్యక్రమంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ.. ‘శంకర్ గారు చేసిన స్నేహితుడు సినిమాకు గెస్టుగా వెళ్లాను. ఆ టైంలో ఆయనతో మాట్లాడేందుకు కూడా చాలా టెన్షన్ పడ్డాను. నాతో కాకపోయినా ఎవరితో అయినా సరే ఓ తెలుగు సినిమా చేయండని అడుగుదామని కూడా అడగలేకపోయాను. కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా.. క్రికెట్‌కు సచిన్ ఎలాగో.. ఇండియన్ సినిమాకు శంకర్ గారు అలా.. డైరెక్టర్లకే డైరెక్టర్ ఆయన” అని పేర్కొన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “అలాంటి శంకర్ గారితో పని చేయడం నా అదృష్టం. నా నుంచి సోలో ఫిల్మ్ వచ్చి ఐదేళ్లు అవుతోంది. ఇది నాకు చాలా ప్రత్యేకమైన సినిమా. ఈ మూవీ ఏ ఒక్కర్నీ నిరాశపర్చదు. ఏం సాధించాలన్నా సహనం ఉండాలి. పుష్ప 2తో సుకుమార్ గారు అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. అలాంటి సుకుమార్ గారు మా ఈవెంట్‌కు వచ్చి మాట్లాడటం ఆనందంగా ఉంది. దిల్ రాజు గారితో పని చేయడం ఆనందంగా ఉంది” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























