డ‌ల్లాస్‌లో ఘనంగా గేమ్ చేంజర్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్‌

Game Changer Pre Release Event Held Grandly at Dallas, USA

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్ట‌ర్‌ ఎస్.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం ‘గేమ్ చేంజ‌ర్‌’. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఓ వైపు అభిమానులు, మ‌రోవైపు సినీ ప్రేక్ష‌కులు గేమ్ చేంజ‌ర్‌ కోసం ఎంతో ఆతృత‌గా ఎదురు చూస్తోన్న సంగ‌తి తెలిసిందే. రామ్ చ‌ర‌ణ్ ఈ చిత్రంలో రెండు ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌ల్లో మెప్పించ‌నున్నారు. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఈ మూవీ జ‌న‌వ‌రి 10న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది.

ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా యు.ఎస్‌లోని డ‌ల్లాస్‌లో గేమ్ చేంజ‌ర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను తాజాగా గ్రాండ్ లెవ‌ల్లో నిర్వ‌హించారు మేకర్స్. ఈ సందర్భంగా అభిమానుల‌తో జ‌రిగిన ఆత్మీయ స‌మ్మేళనంలో మెగా పవర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్, చరిష్మా డ్రీమ్స్ రాజేష్ కల్లెపల్లి త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.