హీరో అల్లరి నరేష్ రస్టిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘బచ్చల మల్లి’. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగాదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. అమృత అయ్యర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ‘సామజవరగమన, ఊరు పేరు భైరవకోన’ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలై టీజర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
బచ్చల మల్లి డిసెంబర్ 20న క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ సంయుక్త ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. వీరితోపాటు దర్శకులు మారుతి, త్రినాథ్ రావు నక్కిన, వశిష్ట, విజయ్ కనకమేడల, యదు వంశీ, కార్తిక్ వర్మ దండు, బలగం వేణు అతిధులు పాల్గొన్నారు. అలాగే సినిమా టీం అంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది.
ఈ సందర్భంగా డైరెక్టర్ సుబ్బు మంగాదేవి చిత్ర విశేషాలు వివరించారు. దర్శకుడు సుబ్బు ఏమన్నారో ఆయన మాటల్లోనే.. “ఈ రోజు నేనిక్కడ ఉండటానికి కారణమైన సాయి దుర్గ తేజ్‌కి ఎప్పుడూ కృతజ్ఞతలు తెలియజేస్తూనే ఉంటా. నా జీవితంలో మరో ముఖ్యమైన వ్యక్తి మారుతి గారు. అమ్మ లేని బాధలో ఉన్న నన్ను దాన్నుంచి బయటకు తీసుకొచ్చింది ఆయనే. లవ్ యు సార్.”
“ఈ కథ చెప్పిన తర్వాత నేను ఏదైతే అనుకుంటున్నా అలానే తీస్తా అని చెప్పారు. ఆయన ఆరోజు ఏదైతే చెప్పారో అదే మాట మీద నిలబడ్డారు. అలాంటి ప్రొడ్యూసర్ ఈ సినిమాకి దొరకడం నా అదృష్టం. సినిమాని ప్రేమించే ప్రొడ్యూసర్లు దొరకడం దర్శకులకు అదృష్టం. ఈవెంట్ కి అతిథిగా వచ్చిన సంయుక్త గారికి థాంక్యూ సో మచ్.”
“కావేరి పాత్రకు అమృత ఇయర్ న్యాయం చేశారు. చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. ఆమె తప్ప ఆ క్యారెక్టర్ కి మరొక న్యాయం చేయలేరు. రాజావారు దగ్గర్నుంచి కిరణ్ కష్టాన్ని నేను చూశాను. ఆ కష్టం ‘క’ సినిమాతో పే అఫ్ అయింది. ఆయన ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.”
“ఇక చివరిగా మా హీరో అల్లరి నరేష్ గురించి ఒక్క మాట. బచ్చ లమల్లి క్యారెక్టర్ని కేవలం నరేష్ గారు మాత్రమే చేయగలరు. ఇప్పుడు నేను చెప్పిన దానిని డిసెంబర్ 20న థియేటర్లలో ఆడియెన్స్ సాక్షిగా విట్నెస్ చేయబోతున్నాం. ఒక మంచి సక్సెస్ కోసమే మా ఇద్దరం కలిసామని అనిపించింది. డిసెంబర్ 20 తేదీన ఆ సక్సెస్ ని మనం చూడబోతున్నాం” అని అన్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























