హీరో అల్లరి నరేష్ రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బచ్చల మల్లి’. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగాదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. సామజవరగమన, ఊరు పేరు భైరవకోన బ్లాక్ బస్టర్స్ తర్వాత హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్ సహా ప్రతి ప్రమోషనల్ కంటెంట్‌కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. బచ్చల మల్లి డిసెంబర్ 20న క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో అల్లరి నరేష్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.
బచ్చల మల్లి కథలో మిమ్మల్ని ఎట్రాక్ట్ చేసిన ఎలిమెంట్స్ ఏమిటి?
- డైరెక్టర్ సుబ్బు గారు ఈ కథ చెప్పినప్పుడు సింగల్ సిట్టింగ్ లోనే ఓకే అయింది.
- కథ అంత అద్భుతంగా ఉంది.
- ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో చాలా వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ ఇది.
- ఇందులో హాస్యరసం తప్ప అన్ని వేరియేషన్స్ వున్నాయి.
- ‘నాంది’ తర్వాత డిఫరెంట్ సినిమాలని చేద్దామనుకున్నాను.
- అలా మంచి కంటెంట్ సినిమాల కోసం చూస్తున్న టైంలో ఈ సినిమా వచ్చింది.
- నిర్మాత రాజేష్ గారికి కూడా చాలా నచ్చింది.
- ఆయన చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు.
- అలా ఈ ప్రాజెక్టు మొదలైంది.
బచ్చలమల్లి క్యారెక్టర్ ఇంపాక్ట్ ఎలా వుంటుంది?
- గమ్యంలో గాలి శీను ఎలా గుర్తుండిపోయాడో బచ్చల మళ్ళీ కూడా ఓ పదేళ్ళ పాటు గుర్తుండిపోతాడు.
- క్యారెక్టర్ ఇంపాక్ట్ అలా ఉంటుంది.
- నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి కొత్తగా ట్రై చేశాను.
- ఇది ఆటో బయోగ్రఫీ కాదు.
- డైరెక్టర్ సుబ్బు గారి ఊర్లో బచ్చల మల్లి అనే ఒక క్యారెక్టర్ ఉంది.
- ఆయన ఊర్లో గొడవలను కూడా తన గొడవలుగా ఫీల్ అయ్యే మనిషి.
- ఆయన జీవితంలోని మూడు ఇన్సిడెంట్ తీసుకొని కంప్లీట్‌గా ఒక డిఫరెంట్ సబ్జెక్టు చెప్పడం జరిగింది.
- బచ్చల మల్లి చాలా ఇంపాక్ట్ ఫుల్ క్యారెక్టర్.
- ప్రతి మనిషిలోనూ బచ్చలమల్లి లాంటి క్యారెక్టర్ ఉంటుంది.
- మనకు తెలియకుండానే జీవితంలో కొన్ని నిర్ణయాలు మూర్ఖత్వంతో తీసుకుంటాం.
- అందరూ రిలేట్ చేసుకునే క్యారెక్టర్ ఇది.
- ఇందులో తెలియకుండానే ఒక మంచి మెసేజ్ కూడా ఉంది.
ఈ సినిమాలో మీకు మోస్ట్ చాలెంజింగ్ పార్ట్ ఏంటి?
- మా డైరెక్టర్ గారు నడకలో కూడా ఒక మూర్ఖత్వం చూపించాలి అని అడిగారు.
- కాస్త కొత్తగా ఏడవండి అని చెప్పేవారు (నవ్వుతూ).
- ప్రతిదీ కొత్తగా చేయాలనే ఉద్దేశంతో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.
- నా గత సినిమాల బాడీ లాంగ్వేజ్ ఎక్కడ కూడా కనిపించకూడదని చాలా జాగ్రత్తగా పడ్డారు.
- ఈ సినిమా చూసిన ఐదు నిమిషాల తర్వాత అల్లరి నరేష్‌ని మర్చిపోయి బచ్చల మల్లినే చూస్తారు.
లుక్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
- ఈ కథ 90లో జరుగుతుంది.
- బచ్చల మళ్ళీ చాలా రస్టిక్ క్యారెక్టర్.
- తను ట్రాక్టర్ నడుపుతుంటాడు.
- తన బాడీ గురించి ఎక్కువ కేర్ తీసుకునే పర్సన్ కాదు.
- అలాంటి లుక్‌ని తీసుకురావడం కోసం హెయిర్‌కి కాస్త రెడ్డిష్ కలర్ ట్రై చేశాం.
క్యారెక్టర్ డ్రివెన్ సినిమాల్లో క్యారెక్టర్ కనెక్ట్ అయితేనే సినిమా కనెక్ట్ అవుతారు మరి ఈ విషయంలో ఎలాంటి కేర్ తీసుకున్నారు?
- ఈ కథని చాలా నిజాయితీగా చెప్పాం.
- ఇందులో ప్రతి ఎలిమెంట్‌ని చాలా నేచురల్‌గా చూపించాం.
- ఒక ఫైట్ సీన్ జరుగుతున్నప్పుడు రియల్‌గా కొట్టుకున్నట్లుగానే ఉంటుంది.
- సినిమాని చాలా రియలిస్టిక్‌గా ప్రజెంట్ చేశాం.
ఇందులో హీరోకి మూర్ఖత్వం ఎక్కువ ఉంటుంది కదా.. మరి దీనికి సంబంధించిన బ్యాక్ స్టోరీ ఏమైనా ఉంటుందా?
- వుంది. ఫాదర్ అండ్ సన్, మదర్ అండ్ సన్ ఎమోషన్ ఉంటుంది.
- నన్ను వద్దనుకుంటే నాకూ ఎవరూ వద్దు అనుకునే క్యారెక్టర్.
- ఒక క్యారెక్టర్‌తో డిస్కనెక్ట్ అయితే ఇంక ఆ చాప్టర్‌ని క్లోజ్ చేసే క్యారెక్టర్.
- ఇందులో యాక్షన్ కథకి తగ్గట్టుగానే ఉంటుంది.
ఇందులో లవ్ స్టోరీకి ఎలాంటి ప్రాధాన్యత ఉంటుంది?
- బచ్చలమల్లి జీవితంలోకి కావేరి అనే అమ్మాయి ఎంటర్ అయిన తర్వాత ఆ అమ్మాయి కోసం మారతాడు.
- ఆ మారే క్రమంలో తను చేసిన పాత తప్పులన్నీ ఎదురవుతుంటాయి.
- ఫైనల్‌గా తన ఏ వైపు టర్న్ తీసుకున్నాడు అనేది ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది.
- అమృత అయ్యర్ చాలా సెటిల్డ్‌గా పెర్ఫార్మ్ చేసింది.
- తన క్యారెక్టర్‌కి మంచి పేరొస్తుంది.
- ఇందులో రావు రమేష్, అచ్యుత్ కుమార్, వైవా హర్ష, హరితేజ, రోహిణి గారు.. అన్నీ క్యారెక్టర్స్ కథలో చాలా కీలకంగా ఉంటాయి.
ఈ సినిమాలో హైలెట్‌గా నిలిచే ఎపిసోడ్స్ ఏంటి?
- ఈ సినిమాలో ప్రీ క్లైమాక్స్ చాలా అద్భుతంగా ఉంటుంది.
- అది బెస్ట్ పార్ట్ ఆఫ్ ది ఫిలిం.
విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ గురించి?
- విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ నాకు చాలా ఇష్టం.
- రీసెంట్ టైంలో సీతారామం పాటలన్నీ సూపర్ హిట్.
- అవన్నీ నాకు చాలా నచ్చాయి.
- ఇందులో నాలుగు సాంగ్స్ ఉన్నాయి.
- చాలా టైం తీసుకుని చాలా బ్యూటిఫుల్‌గా ఆ పాటల్ని చేయడం జరిగింది.
- పాటలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది.
- బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ని చాలా అద్భుతంగా చేశారు.
- ఆడియన్స్‌కి ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది.
- ఈ సినిమా స్క్రీన్ ప్లే బ్యాక్ అండ్ ఫోర్త్‌గా ఉంటుంది.
- 90, 2005 ఇలా రెండు టైమ్ లైన్స్ ఉంటాయి.
- సింపుల్ స్టోరీ చాలా సిన్సియర్‌గా చెప్పాను.
- ఇందులో ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ చాలా బాగుంటుంది.
- విశాల్ చంద్రశేఖర్ గారు తన మ్యూజిక్‌తో ఎమోషన్‌ని స్క్రీన్ పైకి చాలా అద్భుతంగా ట్రాన్స్‌లేట్ చేశారు.
- ఈ సినిమా మొదలుపెట్టినప్పుడే టెక్నీషియన్స్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకూడదని డిసైడ్ చేసుకున్నాం.
- రిచర్డ్ ఎం నాథన్ డిఓపిగా చేశారు. విజువల్స్ చాలా రిఫ్రిషింగ్ ఫీలింగ్ ఇస్తాయి.
మీ నుంచి కామెడీ సినిమాలు తగ్గుతున్నాయి కదా?
- కామెడీ నా స్ట్రెంత్.ఇండస్ట్రీలో ఇంత లాంగ్ కెరీర్ ఉందంటే దానికి కారణం కామెడీనే.
- అది నా హోమ్ గ్రౌండ్. కామెడీని వదలను.
- మధ్యమధ్యలో బ్యాలెన్స్ చేయడానికి ఇలాంటి సీరియస్ కంటెంట్ ఫిలిమ్స్ చేస్తాను.
- డిఫరెంట్ సినిమాలని చేయాలనేదే నా ప్రయత్నం.
నిర్మాత రాజేష్ గారు, రామ్ చరణ్ గారికి ‘రంగస్థలం’ ఎలానో మీకు బచ్చలమల్లి అలాంటి సినిమా అవుతుందని చెప్పారు.. మీకు ఎలా అనిపిస్తుంది?
- ప్రతి నిర్మాత వాళ్ళ హీరో సినిమా అద్భుతంగా ఉండాలని కోరుకుంటారు.
- ఆయన కోరుకున్నట్లు జరిగితే చాలా ఆనందం.
- రంగస్థలంలో సగం జరిగినా మాకు చాలు. (నవ్వుతూ)
- రాజేష్ గారితో ‘మారేడుమిల్లి’ నుంచి మా జర్నీ కుదిరింది.
- ఆయన చాలా మంచి పాషన్ వున్న ప్రొడ్యూసర్.
- ఆయన చేసిన సినిమాలన్నీ హిట్స్ అవుతున్నాయి.
- ఈ సినిమాతో కూడా విజయం కొనసాగాలని కోరుకుంటున్నాను.
సుడిగాడు 2 ఎంతవరకు వచ్చింది?
- రైటింగ్ జరుగుతుంది.
- ఈసారి పాన్ ఇండియా వెళ్తున్నాం.
- కాబట్టి ఇంకాస్త టైం పడుతుంది.
ఆల్ ది బెస్ట్..
థాంక్ యూ.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























