TFDC ఛైర్మన్‌గా.. రేపే దిల్ రాజు ప్రమాణస్వీకారం

Producer Dil Raju To Take Oath as TFDC Chairman Tomorrow

రెండు దశాబ్దాలకు పైగా తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతగా పలు భారీ, చిన్న చిత్రాలను నిర్మిస్తూ, మరికొన్ని సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరిస్తున్న స్టార్ ప్రొడ్యూసర్ శ్రీ వి. వెంకటరమణ రెడ్డి (దిల్ రాజు)కి అరుదైన గౌరవం దక్కింది. గతేడాది తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలికి జరిగిన ఎన్నికల్లో ఘనవిజయం సాధించి తెలుగు ఫిలిం ఛాంబర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన ఇప్పుడు మరో కీలక పదవిని చేపట్టేందుకు సిద్ధమయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ (టీఎఫ్‌డీసీ)గా దిల్ రాజును నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ పదవిలో దిల్‌ రాజు రెండేళ్లపాటు కొనసాగనున్నారు. ఈ నేపథ్యంలో రేపు (బుధవారం, డిసెంబర్ 18, 2024) టీఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు.

ఈ మేరకు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ గౌరవ కార్యదర్శులు నిర్మాత టి. ప్రసన్న కుమార్ మరియు దర్శక,నిర్మాత వైవీఎస్ చౌదరి ఇందుకు సంబంధించి ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. దిల్ రాజు రేపు TFDC ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరిస్తారని, ఈ ప్రమాణస్వీకారం మహోత్సవానికి ఇండస్ట్రీకి చెందిన ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు.

అందులో.. “శ్రీ వి. వెంకటరమణ రెడ్డి (దిల్ రాజు) గారు తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TFDC) ఛైర్మన్‌గా రేపు (18-12-2024) బాధ్యతలు స్వీకరించనున్నారు. బుధవారం ఉదయం 10:30 గంటలకు ఆయన నూతన ఛైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేయనున్నారు. మాసాబ్ ట్యాంక్ లోని A.C. గార్డ్స్ వద్ద గల FDC కాంప్లెక్స్ దీనికి వేదిక కానుంది” అని పేర్కొన్నారు.

కాగా ఈ తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ప్రభుత్వంలోని సినిమాటోగ్రఫీ మంత్రిత్వ శాఖతో కలిసి పనిచేయనుంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమ సమగ్ర, సమర్ధవంతమైన అభివృద్ధిని ప్లాన్ చేయడం, ప్రోత్సహించడం సినిమాలో నైపుణ్యాన్ని ప్రపంచానికి తెలియజేయడమే దీని ముఖ్య ఉద్దేశం. దీనిలో భాగంగా మంచి సినిమాలను ప్రోత్సహించి తద్వారా పరిశ్రమ విస్తరణకు సహకరించనుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.