కోలీవుడ్ స్టార్ హీరో, ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి, నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ వెట్రీమారన్ కలయికలో రూపొందిన ‘విడుదల -1’ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా విజయ్‌సేతుపతి, వెట్రీమారన్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘విడుదల-2’. డిసెంబరు 20న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రముఖ నిర్మాత , శ్రీ వేధాక్షర మూవీస్ అధినేత చింతపల్లి రామారావు. ఈ చిత్ర తెలుగు హక్కులను దక్కించుకున్నారు కాగా ఈ చిత్రం ప్రమోషన్స్‌ల్లో భాగంగా హీరో విజయ్ సేతుపతి, హీరోయిన్ మంజు వారియర్ ఆదివారం హైదరాబాద్‌కు విచ్చేశారు. ఈ సందర్భంగా చిత్రం యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో హీరో విజయ్ సేతుపతి చిత్ర విశేషాలు వివరించారు.
ఈ సందర్భంగా మక్కల్ సెల్వన్ మాట్లాడుతూ ” విడుదల-2 సినిమాలో నటించడం ఎంతో గర్వంగా ఉంది. తెలుగు ప్రేక్షకులు ఇచ్చే సపోర్ట్ ఎంతో గొప్పగా ఉంటుంది. ఇటీవల నా ‘మహారాజ’ చిత్రాన్ని సూపర్‌హిట్ చేశారు. ఆ కోవలోనే విడుదల-2 కూడా మిమ్ములను ఎంతగానో అలరిస్తుందనే నమ్మకం వుంది. ఇళయరాజా సంగీతం ఈ చిత్రానికి బాగా ప్లస్ అవుతుంది. అందరూ ఈ చిత్రాన్ని థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయాలి. అందరిని ఎంతో సంతృప్తి పరిచే చిత్రమిది” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























