భారతీయ ప్రముఖ తబలా విద్వాంసుడు ‘ఉస్తాద్’ జాకీర్ హుస్సేన్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధఫడుతున్న ఆయన రెండు రోజుల క్రితం శాన్ప్రాన్సిస్కోలోని ఓ ఆసుపత్రిలో చేరారు. దీంతో ఆయనకు వైద్యులు ఐసీయూలో చికిత్స అందించారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ఆసుపత్రి వర్గాలు తాజాగా ధృవీకరించాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక జాకీర్ హుస్సేన్ మరణవార్త తెలుసుకున్న దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులు, రాజకీయ ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. కాగా తబలా మాస్ట్రోగా పేరొందిన జాకీర్ హుేస్సన్ 1951 మార్చి 9న ముంబయిలో జన్మించారు. ప్రముఖ తబలా వాయిద్యకారుడు అల్లారఖా పెద్ద కుమారుడైన జాకీర్ హుేస్సన్ చిన్నవయసు నుంచే తండ్రి బాటలో నడిచారు. ఈ క్రమంలో హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ మరియు జాజ్ ఫ్యూజన్లో విశేష ప్రతిభ కనబరిచి సంగీతం ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.
జాకీర్ దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఆరు దశాబ్దాల తన సుదీర్ఘ సంగీత ప్రయాణంలో జాకీర్ హుస్సేన్ అనేక అవార్డులు గెలుచుకున్నారు. 1990లో సంగీత్ నాటక అకాడమీ అవార్డు, 2009లో గ్రామీ పురసస్కారం అందుకున్నారు. అలాగే 1988లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2023లో పద్మవిభూషణ్ పురస్కారాలతో కేంద్ర ప్రభుత్వం ఆయనను గౌరవించింది.
మరోవైపు విశ్వవేదికపై సత్తా చాటిన ఆయన ఐదు గ్రామీ అవార్డులు గెలుచుకోవడం విశేషం. ఈ ఏడాది మొదట్లో 66వ గ్రామీ అవార్డుల్లో మూడింటిని తన వశం చేసుకున్నారు. జాకీర్ హుస్సేన్ తన కెరీర్లో మన దేశంలోని మ్యూజిషియన్స్ సహా ఎంతో మంది అంతర్జాతీయ కళాకారులతో కలిసి పనిచేశారు. నస్సిర్ మున్నీ కబీర్ అనే రచతయిత 2018లో ‘జాకీర్ హుస్సేన్: ఎ లైఫ్ ఇన్ మ్యూజిక్’ పేరుతో యనపై అనే పుస్తకం రచించారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























