గ్లోబల్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో కొత్త సినిమా మొదలైంది. ‘ఆర్సీ16’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్థి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్లో ఈరోజు షూటింగ్ ప్రారంభమైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ మరియు టాలీవుడ్ సీనియర్ యాక్టర్ జగపతిబాబు పవర్ఫుల్ రోల్స్ పోషిస్తున్నారు. నేటినుంచి మైసూర్లో 15 రోజుల మొదటి షెడ్యూల్ ప్రారంభమయింది. ఈ షెడ్యూల్లో రామ్ చరణ్, జాన్వీలపై కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారు. వీరితోపాటు ముఖ్య తారాగణం కూడా పాల్గొననున్నారు.
ఇక #RC16 సినిమాకు అత్యున్నత సాంకేతికవర్గం సహకారం అందిస్తోంది. ‘ఉప్పెన’తో తొలి సినిమాతోనే ఘన విజయం అందుకుని నేషనల్ అవార్డు అందుకున్న దర్శకుడు సాన బుచ్చిబాబు ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తుండగా.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు కెమెరామెన్‌గా పనిచేయనున్నారు.
మరోవైపు రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వం వహించిన ‘గేమ్ ఛేంజర్’ సంక్రాంతి కానుకగా జనవరి 10న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ మొదలయ్యాయి. కియారా అడ్వాణీ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో సునీల్, సముద్రఖని, అంజలి కీలక పాత్రధారులు. ఇక గేమ్ ఛేంజర్, RC16 చిత్రాలు రెండూ భారీ ప్రాజెక్టులు కావడం, పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతుండటంతో మెగాభిమానులు వీటికోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























