టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ హైలీ యాంటిసిపేటెడ్ మల్టీ స్టారర్ ‘జీబ్రా’. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇక ఇటీవలే ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేయగా ఆకట్టుకుంది. జీబ్రా మూవీ నవంబర్ 22న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి స్నీక్ పీక్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీనిని గమనిస్తే, ఈ మూవీ సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లింగ్ అంశాలతో పాటు రోమాన్స్, ఫన్ బ్లెండ్‌ని అద్భుతంగా ప్రజెంట్ చేసింది. సత్యదేవ్ హీరోగా, డాలీ ధనంజయ విలన్‌గా టెర్రిఫిక్‌గా వున్నారు. అలాగే సునీల్ కూడా నెగెటివ్ షేడ్స్‌లో కనిపించి పుష్పను గుర్తుకుతెచ్చాడు. సత్య తన కామిక్ టైమింగ్‌తో అలరించగా.. కథానాయికగా ప్రియా భవానీ శంకర్ లుక్ బావుంది.
కాగా ఈ సినిమాను పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్లపై SN రెడ్డి, S పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తుండగా.. ఎస్ శ్రీలక్ష్మి రెడ్డి సహ నిర్మాతగా ఉన్నారు. ఇక ఈ చిత్రానికి ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ సాంగ్స్ మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సమకూరుస్తుండగా.. సత్య పొన్మార్ సినిమాటోగ్రఫీ, అనిల్ క్రిష్ ఎడిటింగ్, మీరాఖ్ డైలాగ్స్ అందిస్తున్నారు.
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్‌ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























