రివ్యూ: క

KA Review in Telugu

నటీనటులు: కిరణ్ అబ్బవరం, నయన్ సారిక, తన్వీ రామ్, అచ్యుత్ కుమార్, రెడిన్ కింగ్స్లీ తదితరులు
సంగీతం: సామ్ సీఎస్
సినిమాటోగ్ర‌ఫీ: విశ్వాస్ డేనియల్, సతీష్ రెడ్డి మాసం
ఎడిటింగ్: శ్రీ వరప్రసాద్
నిర్మాణం: శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్
నిర్మాత: చింతా గోపాలకృష్ణారెడ్డి
దర్శకత్వం: సుజిత్, సందీప్

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘క’. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో భారీ పీరియాడిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. ఇప్పటికే విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్‌కి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ తర్వాత సినిమాపై ఒక్కసారిగా బజ్ పెరిగింది. దీంతో దర్శక ద్వయం సుజీత్, సందీప్ రూపొందించిన క మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి.

ఈ నేపథ్యంలో దీపా‌వళి పండుగ సందర్భంగా ‘క’ ఈరోజు తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌ అయింది. అయితే ఇంతకూ ఈ మూవీకి క అనే టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? చాలా రోజులుగా సరైన హిట్ కోసం చూస్తున్న కిరణ్ అబ్బవరం ఈ సినిమాతో సక్సెస్ అందుకున్నాడా? పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిన క ప్రేక్షకులను ఆకట్టుకుందా? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

కథ:

అభినయ వాసుదేవ్‌ (కిరణ్‌ అబ్బవరం) ఓ అనాథ. అతనికి గురునాథం మాస్టర్‌ (బలగం జయరామ్‌) తన ఆశ్రమంలో ఆశ్రయమిస్తాడు. అయితే అతడికి తన తల్లిదండ్రులెవరో తెలుసుకోవాలన్న తపన ఎక్కువగా ఉంటుంది. ఇక వాసుదేవ్‌‌కి చిన్నప్పటి నుంచి ఇతరులకు వచ్చే ఉత్తరాలను చదివే అలవాటు ఉంటుంది. అవి చదవడం ద్వారా తాను పొగొట్టుకున్న బంధాల్ని ఆ రాతల్లో చూసుకుంటుంటాడు.

ఇలా ఒకసారి తనకు వచ్చిన ఒక ఉత్తరం చదివాడన్న కోపంతో గురునాథం మాస్టర్‌ వాసుదేవ్‌ని దండిస్తాడు. దీంతో ఆశ్రమంలోని కొంత డబ్బు తీసుకుని పారిపోయి కృష్ణగిరి అనే మారుమూల పల్లెలో కాంట్రాక్ట్‌ పోస్ట్‌మెన్‌గా చేరతాడు. అయితే అక్కడ చుట్టూ ఎతైన కొండలు ఉండటం వలన మధ్యాహ్నం మూడు గంటలకే చీకటి పడుతుంటుంది.

అక్కడి పోస్ట్ మాస్టర్ రామారావు (అచ్యుత్ కుమార్) కుమార్తె సత్యభామ (నయన్ సారిక)తో ప్రేమలో పడతాడు. మరోవైపు తన మంచి నడవడికతో ఆ ఊరి ప్రజలతో కలిసిపోతాడు వాసుదేవ్‌. ఈ క్రమంలో అంతా బావుందని అనుకునే సమయంలో అనూహ్య ఘటనలు జరుగుతాయి. ఆ ప్రాంతంలో తెల్లవారుజామున అమ్మాయిలు మిస్‌ అవ్వడం గమనిస్తాడు వాసుదేవ్‌.

ఇతరుల ఉత్తరాలు చదివే అలవాటున్న వాసుదేవ్‌‌కు తన వద్దకు వచ్చే ఓ ఉత్తరం చదవడం ద్వారా ఈ మిస్సింగ్‌ కేసులకు సంబంధించి ఓ కీలక విషయం తెలుస్తుంది. దీంతో అతను ఇబ్బందుల్లో పడతాడు. గుర్తు తెలియని వ్యక్తులు అతడిని ఓ గదిలో బంధిస్తారు. ఒక ముసుగు మనిషి అతడిని హంతకుడని అంటుంటాడు.

అయితే క్రిష్ణగిరిలో తెల్లవారుజామున అమ్మాయిలు తప్పిపోవడానికి కారణమేంటి? అభినయ్‌ వాసుదేవ్‌ వాసుదేవ్‌ను చీకటి గదిలో బంధించింది ఎవరు? లాలా, అబిద్‌ షేక్‌ల వ్యవహారమేంటి? అభినయ్‌తోపాటు, అతడి గది పక్కన చీకటి గదిలో ఉన్న రాధ (తన్విరామ్‌) ఎవరు? వీరిద్దరి జీవితంలోకి వచ్చిన ఆ ముసుగు వ్యక్తి ఎవరు? వాసుదేవ్‌, సత్యభామ ప్రేమ కథ ఏమైంది? అసలు ఈ చీకటి గది నుంచి అభినయ్‌, రాధ క్షేమంగా బయటపడ్డారా? లేదా? అన్నదే మిగతా కథ.

విశ్లేషణ:

ఉమెన్ ట్రాఫికింగ్ (మహిళల అక్రమ రవాణా) నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. 1990లలో వచ్చిన కృష్ణవంశీ ‘గులాబీ’ నుంచి ఇటీవలి నాని ‘కృష్ణార్జున యుద్ధం’ వరకు.. అంతకుముందు కూడా అడపాదడపా కొన్ని చిత్రాలు ఈ నేపథ్యంలో వచ్చాయి. ఈ క లోనూ ఉమెన్ ట్రాఫికింగ్ మెయిన్ టాపిక్. దర్శక ద్వయం సుజిత్ – సందీప్ తమ ప్రజెంటేషన్ తో ‘క’ సినిమాను మరో లెవెల్ కి తీసుకెళ్లారు.

1980ల నేపథ్యంలో కథ మొదలవుతుంది. దర్శకులు కథను చాలా ఆసక్తికరంగా ప్రారంభించారు. చీకటి గదిలో హీరోని ముసుగు మనిషి బంధించడం, ప్రశ్నలు వేయడం, ఆ కాలచక్రం ఆసక్తి కలిగిస్తాయి. మధ్యలో కొన్ని ఓవర్ ది టాప్ సన్నివేశాలు మెప్పిస్తాయి. రిడిన్ కింగ్ స్లే కామెడీ పర్వాలేదనిపిస్తుంది.

బ్యాక్ టు బ్యాక్ వచ్చే సాంగ్స్ మూవీ కథనాన్ని కొంచెం స్లో చేసినా విజువల్ గా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా జాతర సాంగ్ అయితే పూనకాలు తెప్పిస్తుంది. కిరణ్ అబ్బవరం, నయన్ సారిక రొమాంటిక్ సీన్స్ యూత్ కి కిక్ ఇస్తాయి. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోతోంది. ఆడియెన్స్‌కి ఇది సూపర్ థ్రిల్ అందిస్తుంది. సెకండ్ హాఫ్ లో హీరో ఇన్వెస్టిగేషన్ ఉత్కంఠ కలిగిస్తుంది.

అమ్మాయిల కిడ్నాప్ వెనుక ఉన్నది ఎవరు? అన్న అంశాన్ని తెలియనీయకుండా చివరి వరకు సస్పెన్స్ మైంటైన్ చేశారు. ఎండింగ్ అయితే కొత్త అనుభూతి ఇస్తుంది. థియేటర్ల నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిలో కొత్త క్లైమాక్స్ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. క్లైమాక్స్ ముందుగా గుర్తొచ్చి ఆ తర్వాత కథనం గుర్తుకు వస్తుంది. అంతలా ఇది ప్రభావం చూపిస్తుంది. ఒక సంతృప్తితో బయటకు వస్తాడు ప్రేక్షకుడు.

ఇక నటీనటుల విషయానికొస్తే, కిరణ్ అబ్బవరం మంచి నటుడని ఇప్పటికే పలు చిత్రాలతో ప్రూవ్ చేసుకున్నాడు. తొలి సినిమా ‘రాజావారు రాణిగారు’ తో హిట్ అందుకున్న ఆయన.. ఎస్ఆర్ కల్యాణ మండపంతో లాక్‌డౌన్‌ సమయంలో థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇప్పుడు ఈ సినిమాతో మరోసారి సక్సెస్ అందుకున్నాడనే చెప్పొచ్చు.

హీరోయిన్ నయన్ సారిక ఇంపార్టెన్స్ ఉన్న క్యారక్టర్‌లో నటించింది. కిరణ్ అబ్బవరం, నయన్ సారిక మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. వీరి మధ్య వచ్చే లవ్ సీన్స్ అలరిస్తాయి. మరో కథానాయిక తన్వీ రామ్ కీలక పాత్రలో నటించింది. ఇక అచ్యుత్ కుమార్, రెడిన్ కింగ్స్లీ తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు.

అలాగే టెక్నికల్ అంశాల పరంగా చూస్తే, సామ్ సీఎస్ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్లస్ అయిందనే చెప్పాలి. ముఖ్యంగా క్లైమాక్స్ ముందు వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ లో ఆర్ఆర్ హైలైట్. ఇంకా విశ్వాస్ డేనియల్, సతీష్ రెడ్డి మాసం సినిమాటోగ్ర‌ఫీ అద్భుతంగా ఉంది. 80వ దశకం నాటి వాతావరణాన్ని వారి కెమెరా అద్భుతంగా ప్రజెంట్ చేసింది. నైట్ టైమ్ వచ్చే సీన్స్ చాలా బాగా తీశారు.

ఇక శ్రీ వరప్రసాద్ ఎడిటింగ్ సినిమాకు హెల్ప్ అయిందనే చెప్పాలి. మూవీలో ఎక్కడా గ్రిప్పింగ్ మిస్ అయిన ఫీలింగ్ కలగలేదంటే ఎడిటింగ్ వల్లనే. ప్రొడ్యూసర్స్ చిత్రాన్ని భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో నిర్మించారని అర్ధమవుతుంది. నిర్మాత చింతా గోపాలకృష్ణ రెడ్డి చిత్ర నిర్మాణంలో, ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడలేదని అర్ధమవుతుంది.

ఇక క సినిమా ఆడియెన్స్‌కు గ్యారెంటీగా డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్‌ అయితే అందిస్తుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకూ మూవీ ప్రేక్షకుడిని ఎంగేజ్ చేస్తుంది. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం కేవలం మాస్ ఆడియెన్సే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరించేలా ఉంది. మొత్తానికి ఈ సినిమాతో కిరణ్ అబ్బవరం చాలాకాలం తర్వాత సాలిడ్ హిట్ అందుకున్నాడనే చెప్పొచ్చు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.