కిరణ్ అబ్బవరం ‘క’ ట్రైలర్ రిలీజ్

Kiran Abbavaram's KA Movie Trailer Released

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం సుమారు ఏడాది గ్యాప్ తర్వాత హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘క’ (కిరణ్ అబ్బవరం). సుజీత్-సందీప్ ద్వయం దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నయన్‌ సారిక, తన్వీరామ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే మేకర్స్ మూవీ మ్యూజికల్ ప్రమోషన్స్‌ను కూడా మొదలుపెట్టేశారు. దీనిలో భాగంగా ‘క’ నుంచి రిలీజ్ చేసిన అన్ని పాటలు మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేసి సూపర్ రెస్పాన్స్ అందుకున్నాయి. సామ్ సీఎస్ బ్యూటిఫుల్ కంపోజిషన్‌లో వస్తున్న ఈ సాంగ్స్ థియేటర్లలో ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేయనున్నాయి. దసరా కానుకగా ఈనెల 31న క ప్రేక్షకుల ముందుకు వస్తోన్న సంగతి తెలిసిందే.

దీంతో మేకర్స్ మూవీ ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ‘క’ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇప్పటివరకూ చేయని పాత్రలో కిరణ్ అబ్బవరం కొత్తగా కనిపించాడు. కాగా గత కొంత కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న కిరణ్ అబ్బవరం ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఇప్పుడు ఈ ట్రైలర్ చూస్తుంటే ఈసారి హిట్ కొట్టేలా ఉన్నాడు.

శ్రీ చక్రాస్‌ ఎంటర్‌టైన్‌ మెంట్‌ పతాకంపై నిర్మాత చింతా గోపాలకృష్ణా రెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీ గ్రామీణ నేపథ్యంలో పీరియాడిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన మలయాళ థియేట్రికల్‌ హక్కులను స్టార్ హీరో దుల్కర్‌ సల్మాన్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఓన్ ప్రొడక్షన్ కంపెనీ వేఫరర్ ఫిలింస్ క మలయాళం వెర్షన్‌ను వరల్డ్ వైడ్‌గా ఈ సంస్థ థియేట్రికల్ రిలీజ్ చేయనుంది.

ఇక ఈ సినిమాకు విశ్వాస్ డానియేల్, సతీష్ రెడ్డి మాసం సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. సామ్ సీఎస్ సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీ వరప్రసాద్ ఎడిటర్‌గా పనిచేస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కాబోతుంది. కిరణ్ అబ్బవరం కెరీర్‌లో తొలి పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతుండటంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.