పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ జన్మదినం నేడు. ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఆయనకు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవి, గోపీచంద్, బాబీ, అనిల్ రావిపూడి సహా ఇతర హీరోలు, దర్శకులు, నిర్మాతలు సోషల్ మీడియా వేదికగా ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలావుంటే మరోవైపు ప్రభాస్ అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు. అలాగే ఇంకోవైపు ప్రభాస్ నటించిన పలు హిట్ సినిమాలు రెండు తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో రీ రిలీజ్ అయ్యాయి. దీంతో ఆ థియేటర్ల వద్ద ఈ ఉదయం నుంచే డార్లింగ్ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు.
ఇక ప్రభాస్ జన్మదినం నేపథ్యంలో ఆయా థియేటర్ల వద్ద సందడి నెలకొంది. ఈ సందర్భంగా ఆయన ఫ్యాన్స్ భారీ కేకులు కట్ చేసి తమ అభిమాన హీరో పుట్టినరోజును ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈశ్వర్ ప్రదర్శించబడుతున్న థియేటర్లు డప్పు చప్పుళ్ళు, టపాసుల మోతతో కోలాహలంగా మారాయి. అయితే ఈశ్వర్ సినిమాతోపాటు మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం కూడా రీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























