ప్రేమ కావాలి రీ రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది

Prema Kavali re release trailer out now

ఆది సాయి కుమార్ ,ఇషా చావ్లా ల రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రేమ కావాలి మళ్ళీ రిలీజ్ అవుతుంది.ఈనెల 26న ఈసినిమా సెలెక్టడ్ థియేటర్లలోకి రీ రిలీజ్ కానుంది. అందులో భాగంగా ఈరోజు రీ రిలీజ్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.ఇక 2011లో వచ్చిన ఈసినిమా సూపర్ హిట్ అనిపించుకుంది.నువ్వు నాకు నచ్చావ్ , మన్మథుడు, మల్లీశ్వరి వంటి కల్ట్ సినిమాలను డైరెక్ట్ చేసిన ప్రముఖ డైరెక్టర్ విజయ భాస్కర్ ఈసినిమాను తెరక్కించారు.ప్రముఖ నటుడు సాయి కుమార్ తనయుడు ఆది సాయి కుమార్ ఈసినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు.ఇషా చావ్లా కూడా ఈసినిమాతోనే పరిచయం అయ్యింది.తొలి సినిమాతోనే వీరిద్దరూ సాలిడ్ హిట్ కొట్టి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

థియేటర్లలో ఈసినిమా 100 రోజులు ప్రదర్శించబడింది.అనూప్ రూబెన్స్ మ్యూజిక్ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది.సాంగ్స్ అన్ని సూపర్ హిట్ అయ్యాయి.దేవ్ గిల్ ,నాజర్ , బ్రహ్మనందం ,ఎమ్ ఎస్ నారాయణ ,షఫీ కీలక పాత్రలు పోషించారు.కె అచ్చి రెడ్డి ఈసినిమాను నిర్మించారు.

ఈసినిమా పలు అవార్డులు కూడా గెలుచుకుంది.ఇక ఇన్ని సంవత్సరాల తరువాత ఈసినిమా మళ్ళీ థియేటర్లలోకి వస్తుంది. మరి ప్రేమకావాలి రీ రిలీజ్ ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.