రేపు రీ రిలీజ్ అవుతోన్న ఖడ్గం

Creative Genius Krishna Vamsi's Khadgam Grand Re Release Tomorrow

టాలీవుడ్‌లో గత కొంతకాలంగా రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోన్న విషయం తెలిసిందే. అగ్ర హీరోలు నటించిన ఒకప్పటి హిట్ సినిమాలను మరోసారి ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు మేకర్స్. ఇది ఆయా హీరోల అభిమానులనే కాకుండా మూవీ లవర్స్ అందరికి థ్రిల్ అందిస్తోంది. దీంతో ఇటు ఆడియెన్స్, అటు ప్రొడ్యూసర్స్ ఇద్దరూ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ క్రమంలో తాజాగా మరో సూపర్ హిట్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన కల్ట్ మూవీ ఖడ్గం మళ్ళీ రిలీజ్ కానుంది. శుక్రవారం ఈ సినిమా గ్రాండ్ రీ రిలీజ్ అవుతోంది. అయితే దాదాపు 22 ఏళ్ల తరువాత మళ్లీ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుండటం గమనార్హం.

ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు కృష్ణవంశీ దీనిపై సంతోషం వ్యక్తం చేశారు. భారతీయ జెండా ఒక ఖడ్గం అనే ఉద్దేశ్యంతో ఈ సినిమాకి ఆ టైటిల్ పెట్టి సినిమా తీశామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కాగా ఖడ్గం సినిమా ప్రేక్షకులనే కాదు, విమర్శకులను సైతం మెప్పించి పలు అవార్డులు కూడా గెలుచుకుంది. ఆ ఏడాదికి గానూ ఏకంగా ఐదు నంది పురస్కారాలను అందుకోవడం విశేషం.

ఖడ్గం సినిమాలో శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించగా.. వీరికి జోడీగా సోనాలి బింద్రే, కిమ్ శర్మ, సంగీత, పూజ భారతి ఫిమేల్ లీడ్ రోల్స్‌ పోషించారు. అలాగే ఉత్తేజ్, శివాజీ రాజా, షఫీ, ఆహుతి ప్రసాద్, ఎంఎస్ నారాయణ, పావలా శ్యామల తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. దాదాపు ప్రతి పాత్రకు ఇంపార్టెన్స్ ఉండటం గమనార్హం.

ఇక ఈ సినిమాతోనే ప్రముఖ హాస్య నటుడు పృథ్వీరాజ్, 30 ఇయర్స్ పృథ్వీగా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నాడు. సీనియర్ నటుడు గిరిబాబు మరియు ఆయన తనయుడు, ప్రముఖ కమెడియన్ రఘుబాబు తొలిసారిగా ఇందులో కలిసి నటించడం మరో విశేషం. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే..? ఈ చిత్రం తర్వాత శ్రీకాంత్ సహా అనేకమంది ఇమేజ్ ఒక్కసారిగా మారిపోయింది.

దేశభక్తి ప్రధానంగా రూపొందిన ఖడ్గం చిత్రం 2002 నవంబర్ 29న విడుదలై ఘనవిజయం సాధించింది. సుంకర మధుమురళి కార్తికేయ మూవీస్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు సీనియర్ రచయిత సత్యానంద్‌ రచన చేయగా.. డైరెక్టర్ కృష్ణవంశీ, నటుడు ఉత్తేజ్ సహకారం అందించారు. ఇక ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం పెద్ద ఎస్సెట్ అయింది. అన్ని పాటలు చార్ట్ బస్టర్ అయ్యాయి.

ఇక హార్ట్ టచ్చింగ్ ఎమోషనల్ పేట్రియాటిక్ డ్రామాగా రూపొందిన ఖడ్గం నాడు అన్నివర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకుని బ్లాక్‍బస్టర్ అయింది. మరి ఇప్పుడు ఈ సినిమా ఇప్పటి ఆడియెన్స్‌ని ఎలా ఆకట్టుకుంటుందో.. అప్పటి ఆడియెన్స్‌కు ఎంతలా నోస్టాల్జిక్ ఫీలింగ్ ఇస్తుందో చూడాలి. ఆల్రెడీ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. అలాగే బుకింగ్స్ జోరందుకున్నాయని బుక్ మై షో ట్రెండ్ చూస్తే తెలుస్తోంది.

ఇక రీసెంట్‌గా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘మురారి’ చిత్రం కూడా రీ రీలీజైన విషయం గుర్తుండేవుంటుంది. ఇటీవల విడుదలైన రీ రిలీజ్ మూవీస్‌లో హైయెస్ట్ ఓపెనింగ్స్‌ను రాబట్టి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. ఈ సినిమాకూ దర్శకుడు కృష్ణవంశీనే. ఈ నేపథ్యంలో మరోసారి థియేటర్లలోకి వస్తోన్న ఖడ్గం ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

ఖడ్గం కథ ఏంటంటే..?

కోటి (రవితేజ) సినిమాలపై మోజుతో హీరో కావాలని హైదరాబాద్‌లో అడుగు పెడతాడు. అతని స్నేహితుడు అంజాద్ (ప్రకాష్ రాజ్). యితడు దేవుని యందు సంపూర్ణ విశ్వాసంతో పాటు మానవత్వం కలిగిన ఒక ఆటో డ్రైవర్. అలాగే మంచి దేశభక్తి కలవాడు. అయితే అతని తమ్ముడు అజార్ (షఫీ) కొన్ని సంవత్సరాల క్రితం కనిపించకుండాపోయి ఉంటాడు.

మరోవైపు రాధాకృష్ణ (శ్రీకాంత్) ఒక నిజాయితీ గల పోలీసు అధికారి. అతనికి పాకిస్థాన్ అంటే విపరీతమైన ద్వేషం ఉంటుంది. దీనికి కొన్ని వ్యక్తిగత కారణాలు ఉంటాయి. గతంలో అతని ప్రేయసి స్వాతిని ఐఎసై తీవ్రవాదులు చంపేసి ఉంటారు. అప్పటినుంచి రాధాకృష్ణ ఉగ్రవాదులపట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తుంటాడు.

ఈ క్రమంలో ఒకసారి హైదరాబాద్ పోలీసులు మసూద్‌ అనే కరడుగట్టిన తీవ్రవాదిని నిర్బంధిస్తారు. అతన్ని విడిపించడానికి పాకిస్థాన్ తీవ్రవాదులు అజార్‌కు శిక్షణ ఇచ్చి హైదరాబాద్‌లో మతకలహాలు రేపడానికి పథకం వేస్తారు. ఈ పథకం అమలులో భాగంగా అజర్ తిరిగి హైదరాబాద్ వచ్చి అన్న అంజాద్, తల్లితో కలిసి ఉంటుంటాడు.

పాకిస్తాన్ ఉగ్రవాదులకు టచ్ లో ఉంటూ వారి సలహాలు, సూచనల మేరకు నడుచుకుంటుంటాడు. ఈ నేపథ్యంలో రైలులో బాంబులు పెట్టి జైలులో ఉన్న మసూద్‌ని విడిపించే ప్రయత్నం చేస్తాడు. అయితే ఈ పథకాన్ని కోటి, రాధాకృష్ణ, అంజాద్‌ ముగ్గురూ కలిసి ఎలా అడ్డుకున్నారన్నదే మిగతా చిత్ర కథ. దేశభక్తి కథాంశంతోపాటు జీవితం పట్ల ఉన్నత విలువలు తెలియజెప్పే గొప్ప సినిమా ఈ ఖడ్గం.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.