యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్ లో సాహిత్ మోత్ఖూరి డైరెక్ట్ చేస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా ‘పొట్టేల్’. ఈ చిత్రంలో అజయ్ పవర్‌ఫుల్ రోల్ పోషిస్తున్నారు. నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్ కుమార్ సడిగే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్‌కు స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మ్యూజిక్ కంపోజర్ శేఖర్ చంద్ర అందించిన సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. అక్టోబర్ 25న పొట్టేల్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.
పొట్టేల్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది?
- డైరెక్టర్ సాహిత్‌తో ఇంతకుముందు సవారి అనే సినిమా చేశాను. అందులో పాటలు మంచి హిట్ అయ్యాయి.
- సినిమా కూడా బాగానే రీచ్ అయింది. సాహిత్ చాలా కొత్త థాట్స్‌తో వస్తాడు.
- పొట్టేల్ కథ చెప్పినప్పుడు షాక్ అయ్యాను. కళ్ల వెంట నీళ్లు వచ్చాయి.
- పిల్లల చదువు కోసం పేరెంట్స్ ఎంత స్ట్రగుల్ అయినా పడాలి అనే మంచి పర్పస్ ఈ సినిమాలో ఉంది.
- విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో ఈ కథ ప్రేక్షకుల మనసుల్ని హత్తుకునేలా ఉంటుంది.
ఇందులో మ్యూజిక్ ఇంపార్టెన్స్ ఎంతలా ఉంటుంది?
- రూరల్ బ్యాక్ డ్రాప్‌లో అంబాజీపేట లాంటి సినిమాలు చేశాను.
- కానీ పొట్టేల్ డిఫరెంట్. ఏదో సినిమాకి రీ రికార్డింగ్ చేసినట్లు ఉండదు.
- సిచువేషన్ నుంచి మ్యూజిక్ క్రియేట్ అవుతున్నట్లుగా ఉంటుంది, ఈ సినిమాని చాలా నేచురల్‌గా తీశారు.
- ఆ నేచురల్ ప్రాసెస్‌ని పట్టుకుని మ్యూజిక్ చేయడానికి నాకు కూడా కొంత సమయం పట్టింది.
- డీఫాల్ట్ టెంప్లెట్ ఉండే మ్యూజిక్‌ని ఇందులో చేయలేదు.
- నిజానికి ఎలాంటి సౌండింగ్ చేయాలా అనేది కొంచెం వెతుక్కోవాల్సి వచ్చింది.
- ఒకసారి సెట్ అయిన తర్వాత ఆర్ఆర్, సాంగ్స్ అద్భుతంగా వచ్చాయి.
- ఇప్పటికే సాంగ్స్ కి చాలా సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
- ఇందులోని పాటలు మూవీతో పాటు ఇంకా రీచ్ అవుతాయి.
- ఇందులో లిరిక్స్ సింగిల్ కార్డ్ కాసర్ల శ్యామ్ గారు రాశారు.
- ప్రతి లిరిక్ కథకు చాలా ఇంపార్టెంట్. మంచి లవ్ సాంగ్ కూడా ఉంది.
- డైరెక్టర్ చాలా జెన్యూన్‌గా ఈ సినిమాను తీశారు.
- ఇందులో ఒక విలేజ్ సాంగ్ ఉంది. దాన్ని రూరల్‌గా కాకుండా కొంచెం వెస్ట్రన్ స్టైల్‌లో చేయడం జరిగింది.
- అలాంటి ప్రయోగం చేసే అవకాశం కూడా డైరెక్టర్ గారు ఇచ్చారు. చాలా సపోర్ట్ చేశారు.
మీ సినిమాల్లో ఎక్కువ లిరికల్ ఇంపార్టెన్స్ ఉంటుంది కదా?
- నా సాంగ్స్‌లో లిరిక్స్ బాగా వినపడతాయని దాదాపు లిరిక్ రైటర్స్ అందరూ నాతో ఈ మాట చెప్పారు.
- ట్యూన్స్‌లో కూడా లిరిక్స్ చాలా చక్కగా కూర్చుంటాయి.
- నేనొక డమ్మి లిరిక్ అనుకునే ట్యూన్ చేసుకుంటాను.
- నేను ఎలాంటి హుక్ లైన్స్ అనుకుంటున్నానో రైటర్స్‌కి ఈజీగా తెలుస్తుంది.
- దీంతో రైటర్‌కి కూడా వర్క్ ఈజీ అవుతుంది.
- నా సాంగ్స్‌లో ఎక్కువగా లిరికల్ స్కోప్ ఉంటుంది.
- లిరిక్ రైటర్స్ కూడా అంత అద్భుతంగా రాయడం, సింగర్స్ అద్భుతంగా పాడడం వలన పాటలు ఇంత చక్కగా రీచ్ అవుతున్నాయని భావిస్తాను.
ఈ సినిమా వరకు మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏమిటి?
- ఇందులో నాలుగు సాంగ్స్ ఉన్నాయి. ఈ నాలుగు పాటలు ఛాలెంజే.
- పల్లవిలో ఒక స్టోరీ ఉంటుంది. చరణంలో మరో ఎమోషన్ చెప్పాలి.
- బీజీయంలో కూడా ఆయన ఒక పర్టికులర్ ఎమోషన్‌ని డీల్ చేస్తుంటారు.
- అవన్నీ మైండ్‌లో పెట్టుకుని కంపోజ్ చేయడం జరిగింది.
- ఇందులో ఒక చదువు పాట ఉంది. దాన్ని కూడా చాలా ప్లే ఫుల్‌గా చేయడం జరిగింది.
- ఆ పాటకి చాలా కంటెంట్ ఉండే లిరిక్స్ రాశారు శ్యామ్ గారు.
- ఆ పాట కూడా మూవీ రిలీజ్ తర్వాత చాలా అద్భుతంగా రీచ్ అవుతుంది.
ఆర్టిస్టుల పర్ఫామెన్స్ గురించి?
- యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల, అజయ్.. వీళ్లంతా సినిమాకి పర్ఫెక్ట్‌గా యాప్ట్ అయ్యారు.
- చాలా అద్భుతంగా పెర్ఫార్మన్స్ చేశారు. ఎవరు కూడా ఇందులో మేకప్ వేసుకోలేదు.
- నేచురల్ లైటింగ్‌లో చేయడం జరిగింది. అజయ్ గారు ఈ సినిమాలో ఇరగదీశారు.
- చాలా డిఫరెంట్ క్యారెక్టర్, ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయని క్యారెక్టర్. ఆయన గెటప్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది.
- పొట్టేల్ సినిమా మొత్తం రా అండ్ రస్టిక్‌గా ఉంటుంది. చాలా ఎమోషన్స్ క్యారీ అవుతుంటాయి.
- విలన్, హీరో ఎపిసోడ్స్‌లో హై మ్యూజిక్ ఉంటుంది.
- అజయ్ గారి క్యారెక్టర్‌కి మ్యూజికల్‌గా చాలా మంచి ఎలివేషన్ ఉంటుంది.
- ఆ సిచువేషన్ కూడా చాలా డామినేటింగ్‌గా ఉంటుంది.
- సినిమాకి చాలా రెస్పాన్స్ వస్తుందని నమ్మకం ఉంది
నిర్మాతల గురించి?
- ప్రొడ్యూసర్స్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఖర్చు చేశారు. మేము అనుకున్న సింగర్స్‌తో పాడించాం.
- అనురాగ్ కులకర్ణి, పెంచల్ దాస్ గారు ఇలా మంచి మంచి వాయిస్‌లు ఉన్నాయి.
- నిర్మాతలు సినిమాని బలంగా నమ్మారు. సినిమాని చాలా ప్రేమించి చేశారు.
- మ్యూజిక్ సైడ్ కూడా చాలా సపోర్ట్ చేశారు.
రీసెంట్ టైమ్స్‌లో మీ ఆల్బమ్స్ మిలియన్స్ వ్యూస్ కి రీచ్ అయ్యాయి ఎలా అనిపిస్తుంది?
- చాలా హ్యాపీగా ఉంది, రీసెంట్ టైమ్స్‌లో ఊరు పేరు భైరవకోన లోని ‘నిజమైనా చెబుతున్నా’ పాట కానీ..,
- అంతకుముందు ‘బావుంటుంది నువ్వు నవ్వితే’.. ఇవన్నీ కూడా ఆడియన్స్ విని వాటిని ఓన్ చేసుకొని హిట్ చేశారు. అది నాకు డ్రైవింగ్ ఎనర్జీ.
మీరు చార్ట్ బస్టర్ ఆల్బమ్స్ ఇస్తున్నారు కదా ఇంకా బిగ్ లీగ్ మూవీస్ రాలేదని ఫీలింగ్ ఉందా?
- ఖచ్చితంగా ఉంటుంది. సాంగ్స్ హిట్ అయితే ఆనందంగా ఉంటుంది.
- అయితే ఇంకా హిట్స్ కొట్టాలి, బిగ్ లీగ్ మూవీస్ రావాలి అనే ఫీలింగ్ ఉంటుంది.
- కొన్ని సినిమాలు థియేటర్లో చూసినప్పుడు ఇలాంటి సినిమా మనం చేస్తే బాగుండేది అనిపిస్తుంది.
మ్యూజిక్ డైరెక్టర్ గా ఎలా అప్డేట్ అవుతుంటారు?
- నా వరకైతే చాలా బాగా వింటాను. ఎలాంటి పాటలు వస్తున్నాయి, ఏ ట్రెండ్ నడుస్తుందో గమనిస్తుంటాను.
- అలాగే వరల్డ్ మూవీస్ కూడా చూస్తుంటాను.
మీ నాన్నగారు సినిమాటోగ్రాఫర్ కదా మరి మీరు మ్యూజిక్ వైపు ఎలా వచ్చారు?
- అది నిజంగా నాకు తెలియదండి. అది గాడ్ గ్రేస్ అనుకుంటాను.
- మా ఫాదర్ కూడా షాక్ అయ్యారు. అది మనకు తెలియని ఫీల్డ్ కదా అన్నారు.
- కానీ ఎదో ఎనర్జీ మ్యూజిక్ వైపు నన్ను డ్రైవ్ చేసింది.
- నేను మ్యూజిక్ నేర్చుకున్నాను. పియానోలో గ్రేడ్స్ చేశాను.
- తర్వాత కర్ణాటక క్లాసిక్ వోకల్ క్లాసెస్‌కి వెళ్లాను. వయోలిన్ నేర్చుకున్నాను.
- అన్ని రకాలుగా సిద్ధమైన తర్వాతే కంపోజింగ్ జర్నీ మొదలైయింది.
అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి?
- రాజ్ తరుణ్‌తో ఒక సినిమా చేస్తున్నాను.
- అలాగే నవీన్ చంద్ర గారితో ఒక సినిమా చేస్తున్నాను.
- వరలక్ష్మీ శరత్ కుమార్ గారి కూర్మనాయికి మూవీకి చేస్తున్నాను.
- తెలుగు-కన్నడ మూవీ ఒకటి జరుగుతోంది.
ఆల్ ది బెస్ట్..
- థాంక్యూ.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























