చార్మింగ్ స్టార్ శర్వా ఇటీవలే తన మేడిన్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ శర్వా 38ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. బ్లాక్ బస్టర్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లను అందించే డైరెక్టర్ సంపత్ నంది ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని ప్రతిష్టాత్మక శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె.రాధామోహన్ ప్రొడక్షన్ నెం.15గా నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హై ప్రొడక్షన్, టెక్నికల్ వాల్యూస్‌తో రూపొందే ఈ చిత్రాన్ని లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు. కాగా శర్వా మునుపెన్నడూ చూడని పాత్రలో కనిపించనున్నాడు. 60ల నాటి పాత్రను పోషించడానికి అద్భుతంగా మేకోవర్ అవుతున్నాడు. 1960లో ఉత్తర తెలంగాణ, తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే పల్సేటింగ్ పీరియడ్ యాక్షన్ డ్రామాగా శర్వా 38 రూపొందుతోంది.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్ర టీమ్ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటోంది. దీనికి సంబంధించిన సెట్ వర్క్‌ను తాజాగా భూమి పూజతో ప్రారంభించింది చిత్ర బృందం. ఉత్తర తెలంగాణ స్వరూపాన్ని, వరల్డ్, కల్చర్‌ని రీక్రియేట్ చేసే మ్యాసీవ్ సెట్‌ని హైదరాబాద్ సమీపంలో నిర్మిస్తున్నారు.
ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ కుమార్ మన్నె ఆధ్వర్యంలో దీనిని సుమారు 15 ఎకరాల విస్తీర్ణంలో హై బడ్జెట్‌తో రూపొందించారు. పల్సేటింగ్ పీరియడ్ యాక్షన్ డ్రామా కోసం నిర్మించిన ఈ మ్యాసీవ్ సెట్ మన చరిత్రలోని ఇంపార్టెంట్ టైమ్స్ లోకి ఆడియన్స్‌ని తీసుకువెళ్ళనుంది. ఈ సెట్‌లో కొన్ని అద్భుతమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
ఇక ఈ సినిమా కోసం అత్యున్నత స్థాయి సాంకేతిక నిపుణుల పని చేస్తున్నారు. సౌందర్ రాజన్. ఎస్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీకి పని చేసే తారాగణం, ఇతర ప్రముఖ సాంకేతిక నిపుణులు వివరాలు త్వరలో తెలియజేస్తారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























