నేచురల్ స్టార్ నాని సెన్సేషనల్ హిట్ ‘దసరా’ తర్వాత హైలీ యాంటిసిపేటెడ్ సెకండ్ కొలబరేషన్ కోసం దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (SLV సినిమాస్) నిర్మాత సుధాకర్ చెరుకూరితో మరోసారి చేతులు కలిపారు. వీరి కాంబోలో నాని-ఓదెల 2 దసరా సందర్భంగా గ్రాండ్‌గా లాంచ్ అయిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందింది. ఈ సినిమాకు సెన్సేషనల్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించనున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ బుధవారం అనిరుధ్ జన్మదినం సందర్భంగా అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. కాగా జెర్సీ, గ్యాంగ్‌లీడర్ సక్సెస్ ఫుల్ ప్రాజెక్ట్‌ల తర్వాత నాని, అనిరుధ్ కాంబోలో ఇది హ్యాట్రిక్ మూవీ కావడం విశేషం.
ఇక శ్రీకాంత్ ఓదెల మునుపెన్నడూ చూడని మాస్ క్యారెక్టర్‌లో నానిని ప్రెజెంట్ చేసే గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో ఆకట్టుకునే, లార్జర్ దెన్ లైఫ్ కథని రూపొందించారు. మోస్ట్ ఫెరోషియస్ పాత్ర కోసం నాని మేకోవర్‌కి సిద్ధంగా ఉన్నారు. పాషనేట్ ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
సక్సెస్ ఫుల్ అండ్ డైనమిక్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ ప్రాజెక్ట్ నానికి మోస్ట్ ఎక్స్‌పెన్సీవ్ సినిమా కానుంది. ఈ హైలీ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్ స్టొరీ టెల్లింగ్, ప్రొడక్షన్ క్యాలిటీ, టెక్నికల్ గా నెక్స్ట్ లెవల్ లో వుండబోతోంది. ఇక ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలో తెలియజేయనున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: