గతేడాది విరుపాక్ష, బ్రో సినిమాలతో ప్రేక్షకులను అలరించిన సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ ప్రస్తుతం తన 18వ చిత్రంలో నటిస్తున్నాడు. ‘హనుమాన్’ సినిమాను నిర్మించిన నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. SDT18గా వ్యవహరిస్తున్న ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గానే మొదలయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ క్రమంలో ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్‌లో సెకండ్ షెడ్యూల్ జరుపుకుంటోంది. దాదాపు 100 కోట్ల బడ్జెట్‌తో 1940 కాలంనాటి పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌లో యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. యంగ్ డైరెక్టర్ రోహిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాయి దుర్గ తేజ్ పవర్ ఫుల్ రోల్‌లో కనిపించనున్నాడు. ఆయన సరసన ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటిస్తుంది.
ఇటీవలే ఆమె బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుండి తన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసి విషెస్ తెలిపింది చిత్ర బృందం. కాగా ఐశ్వర్య ఇందులో ‘వసంత’ అనే పాత్ర పోషిస్తోంది. ఇదిలావుంటే, రేపు సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా SDT18 టీమ్ బిగ్ అప్‌డేట్ ఇవ్వనుంది. ఈ మేరకు సోమవారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. దీంతో ఈ అప్‌డేట్ దేనికి సంబంధించినదై ఉంటుందా అని అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు.
కాగా ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ పార్ట్ ఎక్కువగా ఉండనుంది. దీంతో కంటెంట్ మీద వున్న నమ్మకంతో ఖర్చుకి ఎక్కడా వెనుకాడకుండా సినిమాను నిర్మిస్తున్నారు నిర్మాతలు. వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా విడుదలకానున్న ఈ సినిమా సాయి దుర్గా తేజ్‌కు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో వేచిచూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























