మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘మట్కా’. ‘పలాస 1978’ ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలో పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. వరుణ్ తేజ్ వాసు అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ తుదిదశకు చేరుకుంది. చిల్డ్రన్స్ డే సందర్భంగా నవంబర్ 14న మట్కా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
1958-1982 మధ్య కాలంలో దేశాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన ఒక వాస్తవ సంఘటనను ఆధారం చేసుకొని ఈ సినిమా తెరకెక్కింది. మట్కా నుంచి ఇప్పటికే విడుదల చేసిన స్పెషల్ గ్లింప్స్ మరియు ఇతర ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా మట్కా టీజర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ టీజర్‌కు మూవీ లవర్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.
ఈ టీజర్ గమనిస్తే, వరుణ్ తేజ్ ఈసారి సాలిడ్ హిట్ అందుకుంటాడనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ‘లే లే రాజా’ అంటూ సాగే ఈ పాటకు భాస్కరభట్ల రవికుమార్ సాహిత్యం అందించగా.. నీతి మోహన్ ఆలపించారు. ఈ పాటకు జీవీ ప్రకాష్ కుమార్ అద్భుతమైన సంగీతం సమకూర్చారు.
కాగా మట్కా చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, ఎ కిషోర్ కుమార్ సినిమాటోగ్రఫీ, కార్తీక శ్రీనివాస్. ఆర్ ఎడిటింగ్ అందిస్తున్నారు. కాగా మట్కా మూవీని వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల మరియు రజనీ తాళ్లూరి భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























