మెగాస్టార్ చిరంజీవి హైలీ యాంటిసిపేటెడ్ క్రేజీ సోషియో-ఫాంటసీ ఎంటర్‌టైనర్ ‘విశ్వంభర’. తన డెబ్యు మూవీ బింబిసారతో బ్లాక్ బస్టర్ అందించిన దర్శకుడు వశిష్ట ‘విశ్వంభర’ ను అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా తీర్చిదిద్దుతున్నారు. సక్సెస్ ఫుల్ నిర్మాణ సంస్థ UV క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని అందించబోతోంది. మేకర్స్ ప్రామిస్ చేసినట్లుగా, దసరా సందర్భంగా మోస్ట్ అవైటెడ్ విశ్వంభర టీజర్ లాంచ్ చేసిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
డైరెక్టర్ వశిష్ట మునుపెన్నడూ చూడని అద్భుతమైన ప్రపంచాన్ని సృస్టించాడు. ప్రస్తుతం ఈ టీజర్ నెట్టింట నంబర్ 1 ట్రెండింగ్‌లో ఉంది. ఈ టీజర్ గమనిస్తే.. విజువల్ స్టన్నింగ్ టీజర్, మూవీ ప్రిమైజ్ ని ప్రజెంట్ చేస్తూ ప్రేక్షకులని మెగా మాస్ బియాండ్ యూనివర్స్ లోకి తీసుకెళ్ళింది. మిస్టికల్ ల్యాండ్ స్కేప్ లో చేపల ఆకారంలో ఉన్న పక్షులు ఆకాశంలో ఎగురుతూ, గర్జించే ఖడ్గమృగాలు, ఎగిరే గుర్రాలని విజువల్ వండర్‌గా ప్రజెంట్ చేస్తూ టీజర్ ఓపెన్ అయింది. ఒక దుష్ట శక్తి ఈ రాజ్యంలో అరాచకం సృష్టిస్తుంది.
”విశ్వాన్ని అలుముకొన్న ఈ చీకటి విస్తరిస్తున్నంత మాత్రాన వెలుగు రాదని కాదు..ప్రశ్నలు పుట్టించిన కాలమే సమాధానాన్ని కూడా సృష్టిస్తుంది. విర్రవీగుతున్న ఈ అరాచకానికి ముగింపు పలికే మహాయుద్ధాన్ని తీసుకొస్తుంది” అనే పవర్ ఫుల్ వాయిస్ తో టీజర్ నెక్స్ట్ లెవల్ కి వెళ్ళింది. ఈ చీకటిని అంతం చేయడానికి మునుపెన్నడూ లేనివిధంగా ఒక లెజెండ్ వస్తారు. మెగాస్టార్ చిరంజీవి ఎగిరే గుర్రాన్ని స్వారీ చేస్తూ సూపర్ హీరోలా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడం అద్భుతమనిపించింది.
టీజర్ చిరంజీవి బ్రెత్ టేకింగ్ యాక్షన్ సీక్వెన్స్‌లను ప్రజెంట్ చేసింది. హనుమంతుని విగ్రహం తనికి మార్గనిర్దేశం చేసే డివైన్ పవర్ ని సూచించింది. టీజర్ లో ప్రిమైజ్, నెరేటివ్ కట్టిపడేసింది. యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా వున్నాయి. చివరి పార్ట్స్, లార్డ్ హనుమాన్ విగ్రహం, చిరంజీవి పవర్ ఫుల్ యాక్షన్ గ్రిప్పింగ్‌గా కట్ చేసిన టీజర్‌కు పర్ఫెక్ట్ ఎండింగ్ ఇచ్చింది. చిరంజీవి యంగ్ అండ్ చార్మింగ్ గా కనిపించారు. రీసెంట్ టైమ్స్ లో మెగాస్టార్ బెస్ట్ ట్రాన్స్ ఫర్మేషన్ ఇది.
ఫాంటసీ అడ్వెంచర్‌కి తిరిగి వచ్చినప్పుడు స్త్రింగ్ స్క్రీన్ ప్రజెన్స్ కట్టిపడేసింది. యాక్షన్ సీక్వెన్స్‌లలో అదరగొట్టారు. యాంటీ-హీరో ముఖం చూపించనప్పటికీ, ఆ క్యారెక్టర్ బలమైన ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్ ప్రధాన కథానాయికలుగా నటిస్తుండగా, కునాల్ కపూర్ పవర్ ఫుల్ పాత్ర పోషిస్తున్నారు. అయితే టీజర్‌లో ప్రధానంగా చిరంజీవి క్యారెక్టర్ ని పరిచయం చేశారు.
చోటా కె నాయుడు బ్రెత్ టేకింగ్ సినిమాటోగ్రఫీ ఒక కొత్త స్టాండర్డ్ ని సెట్ చేసింది, ఇమాజనరీ యూనివర్స్ ని విజువల్ వండర్ గా చూపించారు. ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ MM కీరవాణి అద్భుతమైన స్కోర్‌తో విజువల్స్‌ను ఎలివేట్ చేశారు. UV క్రియేషన్స్ నిర్మాతలు వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి ప్రొడక్షన్ వాల్యూస్ గ్లోబల్ సినిమాని మ్యాచ్ చేశాయి. విక్రమ్‌రెడ్డి సమర్పిస్తున్నారు. కోటగిరి వెంకటేశ్వరరావు, సంతోష్ కామిరెడ్డి ఎడిటర్స్ కాగా, సుస్మిత కొణిదెల స్టైలిస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ అద్భుతమైన టీజర్‌ని చూసిన తర్వాత, విశ్వంభరను చూడాలనే ఎక్సయిట్మెంట్ ఆకాశాన్ని తాకింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























