నవ దళపతి సుధీర్ బాబు హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మా నాన్న సూపర్ హీరో’. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని CAM ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి V సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు నిర్మించారు. ఆర్ణ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సాయి చంద్, సాయాజీ షిండే కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 11న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమాకి యూనానిమస్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ ప్రెస్ మీట్‌లో హీరో సుధీర్ బాబు తన ఆనందాన్ని పంచుకున్నారు. సుధీర్ బాబు ఏమన్నారో ఆయన మాటల్లోనే చూద్దాం.. “దాదాపు పది థియేటర్స్‌లో మా నాన్న సూపర్ హీరో పెయిడ్ ప్రీమియర్స్ వేశాం. అక్కడ్నుంచి యూనానిమస్‌గా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రెస్పాన్స్ వచ్చింది. మేము ఎక్కడైతే పబ్లిక్ కనెక్ట్ అవుతారని అనుకున్నామో సరిగ్గా మేము ఊహించినట్లే ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు. వైజాగ్‌లో ఒక మాస్ థియేటర్‌లో ఆడియన్స్‌తో కూర్చొని సినిమా చూశాను.”
“కొన్ని సీన్స్ కి క్లాప్స్ కొడుతున్నప్పుడు ఆడియన్స్‌కి ఈ సినిమా ఎంత బాగా నచ్చిందో అర్థమౌతుంది. సినిమా చివరిలో చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు. ఆ సైలెన్స్‌ని కూడా ఎంజాయ్ చేశాం. ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో ఇది ‘వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్’ అని నేను నమ్ముతున్నాను. సినిమా చూశాక నాన్న గుర్తొస్తున్నారు, మాటలు రావడంలేదని ఆడియన్స్ చెప్తున్నారు. ఆడియన్స్ అంత బాగా కనెక్ట్ అవ్వడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.”
“డైరెక్టర్ అభిలాష్ వండర్ బాయ్. చాలా అద్భుతంగా తీశాడు. ఈ సినిమాని తను తప్పితే మరో దర్శకుడు ఇంత చక్కగా తీయగలడని నేను అనుకోవట్లేదు. జై ఫెంటాస్టిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. సమీర్ వండర్ఫుల్ విజువల్స్ ఇచ్చాడు. శశాంక్ వండర్‌ఫుల్ యాక్టర్. తనతో యాక్ట్ చేయడం చాలా ఎంజాయ్ చేశాను. ఆర్ణ టెర్రిఫిక్‌గా యాక్ట్ చేసింది. తను ఫ్యూచర్‌లో ఇంకెన్నో మంచి ప్రాజెక్ట్ చేయాలని కోరుకుంటున్నాను. సునీల్ నేను మంచి ఫ్రెండ్స్. ఇద్దరం కలిసి ఇలాంటి ఒక మంచి సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ దసరాకి ఫ్యామిలీ అంతా కలిసి సినిమా చూడండి. డెఫినెట్‌గా చాలా ఎంజాయ్ చేస్తారు” అని అన్నారు హీరో సుధీర్ బాబు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























