మత్తు వదలరా 2 స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

Mathu Vadalara 2 to stream on NETFLIX from tomorrow

మత్తు వదలరాకు సీక్వెల్ గా వచ్చిన మత్తు వదలరా 2 రీసెంట్ గా థియేటర్లోకి వచ్చి సూపర్ హిట్ అనిపించుకుంది.దాదాపు 30కోట్లకు పైగా వసూళ్లను సాధించి బయ్యర్స్ మంచి లాభాలను తీసుకొచ్చింది. ఇక ఈసినిమా ఓటిటిలోకి రానుంది.ఈరోజు రాత్రి 12గంటలనుండి నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది.తెలుగు తోపాటు కన్నడ ,మలయాళ ,తమిళ భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది.అయితే అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ నెట్ ఫ్లిక్స్ తన అప్ కమింగ్ మూవీస్ లిస్ట్ లో ఈ శుక్రవారం రానుందని తెలియజేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక దేవర వచ్చే వరకు థియేటర్లలో స్ట్రాంగ్ రన్ ను కొనసాగించింది మత్తు వదలరా 2.ఆ తరువాత స్లో అయిపోయింది.కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అటు ఓవర్సీస్ లోనూ మత్తు వదలరా 2 బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది.అక్కడ 1మిలియన్ డాలర్ల్ మార్క్ క్రాస్ చేసింది.

రితేష్ రానా ఈసినిమాను డైరెక్ట్ చేయగా శ్రీ సింహ,కమెడియన్ సత్య,ఫరియా అబ్దులా లీడ్ రోల్స్ లో నటించారు.సత్య కామెడీ సినిమాకు మేజర్ హైలైట్ గా నిలిచింది. సునీల్,వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో కనిపించారు.కాలభైరవ సంగీతం అందించాడు.మైత్రి మూవీ మేకర్స్,క్లాప్ ఎంటర్టైన్మెంట్ ఈసినిమాను నిర్మించాయి.ఇక ఈసినిమాకు సీక్వెల్ కూడా రానుంది.అన్ని కుదిరితే మత్తువదలరా 3 వచ్చే ఏడాది స్టార్ట్ అయ్యే ఛాన్స్ వుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.