రివ్యూ: విశ్వం

Macho Star Gopichand's Viswam Movie Telugu Review

నటీనటులు: గోపీచంద్, కావ్య థాపర్, జిషు సేన్‌గుప్తా, నరేష్ విజయకృష్ణ, సునీల్, ప్రగతి, కిక్ శ్యామ్, VTV గణేష్, వెన్నెల కిషోర్, శ్రీకాంత్ అయ్యంగార్, రాహుల్ రామకృష్ణ, పృథ్వీ, ముఖేష్ రిషి తదితరులు
సంగీతం: చైతన్ భరద్వాజ్
సినిమాటోగ్ర‌ఫీ: కెవి గుహన్
ఎడిటింగ్: అమర్‌ రెడ్డి కుడుముల
నిర్మాణం: చిత్రాలయం స్టూడియోస్‌, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
నిర్మాతలు: వేణు దోనేపూడి, టీజీ విశ్వప్రసాద్
దర్శకత్వం: శ్రీను వైట్ల

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మాచో స్టార్ గోపీచంద్ హీరోగా ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల కొలాబరేషన్‌లో తొలిసారిగా వస్తోన్న తాజా చిత్రం ‘విశ్వం’. ఈద్ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ స్ట్రైక్ వీడియో ఆడియెన్స్‌కి మాస్ ఫీస్ట్‌ని అందించింది. ఇక తాజాగా ఈ చిత్రం నుండి ట్రైలర్‌ రిలీజ్ చేయగా.. దీనికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో విశ్వం మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గోపీచంద్ 32వ సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం హిట్ కొట్టిందా? శ్రీను వైట్లతో గోపీచంద్ తొలిసారిగా చేసిన ఈ ప్రయత్నం సఫలం అయిందా? ఇరువురికీ చాలా ఏళ్లుగా ఊరిస్తున్న విజయం ఈ సినిమాతో అయినా దక్కిందా? లేదా? అన్నది ఇప్పుడు చూద్దాం..

కథ:

కథానాయిక సమైరా (కావ్యా థాపర్) ఒక కాస్ట్యూమ్ డిజైనర్. తను మిలాన్ వెళ్లినప్పుడు అక్కడ గోపి (గోపీచంద్) పరిచయం అవుతాడు. సమైరాను చూసి ప్రేమలో పడిన అతడు ఆమె కోసం ఇట‌లీ నుంచి హైద‌రాబాద్‌కు వ‌స్తాడు. అయితే గోపి ఇక్కడికి వచ్చిన తర్వాత అనుకోకుండా ప్రమాదంలో ఉన్న సమైరా అన్న కూతురు ద‌ర్శ‌నని కాపాడి ఆమె కుటుంబానికి ద‌గ్గ‌ర‌వుతాడు. ఆ తర్వాత దర్శన ప్రాణాలకు థ్రెట్ ఉందని తెలుసుకుంటాడు. దీంతో ఎలాగైనా పాపను కాపాడాలని ఫిక్స్ అవుతాడు గోపి.

ఈ క్రమంలో తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటానికి సిద్దమవుతాడు. అయితే అసలు ఆ పాపను చంపడానికి ప్రయత్నిస్తోంది ఎవరు? ఇంతకూ ఈ గోపి నేపథ్యం ఏమిటి? ఆమెను కాపాడటానికి వచ్చిన విశ్వం ఎవరు? కథలో బాచిరాజు (సునీల్), సంజయ్ శర్మ పేరుతో ఇండియాలో సెటిలైన జలాలుద్దీన్ ఖురేషి (జిష్షుసేన్ గుప్తా) పాత్రల నేపథ్యం ఏమిటి? ద‌ర్శ‌న ప్రాణాలకు, ఇండియాలో తీవ్రవాద చర్యలకు సంబంధం ఏమిటి? నిజంగానే సమైరా ప్రేమ కోస‌మే విశ్వం హైద‌రాబాద్ వ‌చ్చాడా? విశ్వం అస‌లు ల‌క్ష్యం ఏమిటి? అనేది మిగతా సినిమా.

విశ్లేషణ:

మాస్ హీరోగా ఎన్నో కమర్షియల్ హిట్స్ అందుకున్న గోపీచంద్ గత కొంతకాలంగా రేసులో వెనుకబడ్డారు. ఆయన సాలిడ్ హిట్ కొట్టి చాలా ఏళ్ళు అయింది. ఈ క్రమంలో గోపీచంద్ అనేక ప్రయోగాలు చేస్తున్నారు. ఇక మరోవైపు డైరెక్టర్ శ్రీను వైట్ల పరిస్థితి కూడా ఇంచుమించు ఇలానే ఉంది. స్టార్ హీరోలతో పలు బ్లాక్ బస్టర్స్ కొట్టిన ఆయన ప్రస్తుతం పూర్వ వైభవం సాధించాలని గట్టి పట్టుదలగా ఉన్నారు. దూకుడు, బాద్ షా చిత్రాల తర్వాత శ్రీను వైట్లకు సరైన సక్సెస్ లేదు.

ఈ నేపథ్యంలో వీరిద్దరు ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో విశ్వం కోసం తొలిసారిగా చేతులు కలిపారు. ఇక విశ్వం శ్రీను వైట్ల మార్క్ పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అని చెప్పాలి. 155 నిమిషాల నిడివి గల ఈ సినిమా దర్శకుడు విడుదలకు ముందు చెప్పినట్టుగానే ఎక్కడా బోర్ కొట్టకుండా మూవీ ఆసాంతం ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుంది.

ద్వారకాలో ఒక హ్యూజ్ బాంబ్ దాడి జరిగిన సన్నివేశాలతో సినిమా మొదలవుతుంది. గోపిచంద్ ఇంట్రడక్షన్ తర్వాత సినిమాపై ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఒకవైపు ఫ్యామిలీ డ్రామా, మరోవైపు కథానాయికతో లవ్ ట్రాక్‌తో సినిమా తొలిసగం మంచి ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది. గోపిచంద్, కావ్య థాపర్ జోడి బాగుంది. పృథ్వీరాజ్ తదితరులుపై కామెడీ సీన్స్ వర్కవుట్ అయ్యాయి.

ఓ సర్‌ప్రైజింగ్ ట్విస్ట్‌తో ఇంటర్వెల్ కార్డు పడుతుంది. సెకండాఫ్ మూవీ గోవాకి షిఫ్ట్ అవుతుంది. వెంకీ సినిమాలో మాదిరి వచ్చే ట్రైన్ ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది. 30 నిమిషాల నిడివి ఉన్న ఈ సీన్ సినిమాకే హైలైట్. ఇందులో ముఖ్యంగా వెన్నెల కిషోర్ తన కామెడీ టైమింగ్‌తో అదరగొట్టాడు. ఇంటర్వెల్ ముందు పృథ్వీ, ఇంటర్వెల్ తర్వాత వెన్నెల కిశోర్‌ ఇరగదీశారు.

గోపీచంద్ పాత్రకు సంబంధించి ట్విస్ట్ రివీల్ ప్రేక్షకులకు ఒక్కసారిగా కిక్ ఇస్తుంది. క్లైమాక్స్ ఎలా ఉంటుందనేది ప్రేక్షకుడు ఊహించేలానే ఉన్నా చూపించిన విధానం బావుంది. ఈ క్లైమాక్స్ పార్ట్ లాస్ట్ 30 మినిట్స్ ఇంకొంచెం బాగా తీసి ఉంటే సినిమా ఎక్కడో ఉండేది. సినిమాలో కొన్ని యాక్షన్ సీన్స్ అయితే ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను టేకింగ్‌కి మించి ఉన్నట్టు అనిపిస్తుంది.

ఇక నటీనటుల విషయానికొస్తే, గోపీచంద్ ఎలాంటి నటుడో వివరించి చెప్పనక్కరలేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా ఆయన ఎన్నో యాక్షన్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ఈ చిత్రం కూడా ఆయన బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్టు ఉంటుంది. సినిమా అంతా ఆయన ఒంటిచేత్తో నడిపించారని చెప్పొచ్చు. గోపిచంద్ గత చిత్రాలతో పోల్చితే విశ్వం బాగుందని అంటున్నారు.

ఇతర నటవర్గంలో హీరోయిన్ కావ్య థాపర్‌కు ఇందులో మంచి పాత్ర లభించింది. జిషు సేన్‌గుప్తాకు విలన్‌గా ఇంపార్టెన్స్ ఉన్న పాత్రే దొరికింది. ఇక మిగతా వారిలో నరేష్ విజయకృష్ణ, సునీల్, ప్రగతి, కిక్ శ్యామ్, VTV గణేష్, వెన్నెల కిషోర్, శ్రీకాంత్ అయ్యంగార్, రాహుల్ రామకృష్ణ, పృథ్వీ, ముఖేష్ రిషి తదితరులు తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు.

అలాగే టెక్నికల్ విషయానికొస్తే, విశ్వం మూవీ హై స్టాండర్డ్స్‌లో రూపొందింది. ఓవరాల్‌గా టెక్నికల్ వాల్యూస్ ఉన్నతంగా ఉన్నాయి. చైతన్ భరద్వాజ్ అందించిన సంగీతం అలరిస్తుంది. కేవలం పాటలే కాకుండా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా సన్నివేశాలని ఎలివేట్ చేసేలా ఉంది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్‌లో వచ్చే బీజీఎమ్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది.

సినిమాటోగ్ర‌ఫర్ కెవి గుహన్ పనితనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గుహన్ గత చిత్రాలు చూసినవారికి తెలుస్తుంది ఆయన ఎంత క్వాలిటీ అవుట్ ఫుట్ ఇస్తాడో. సినిమాలో విజువల్స్ బాగా ఆకట్టుకుంటాయి. లొకేషన్స్ బావున్నాయి. ఇక అమర్‌ రెడ్డి కుడుముల ఎడిటింగ్ చాలా షార్ప్‌గా ఉంది. అలాగే నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి. మేకర్స్ ఖర్చుకు ఎక్కడా వెనుకాడలేదని అర్ధమవుతుంది.

ఇక ఓవరాల్‌గా విశ్వం సినిమా పక్కా కమర్షియల్ ఫార్మాట్‌లో సాగినా ఆడియెన్స్‌ను ఎంగేజ్ చేయిందనే చెప్పాలి. ఇంతకుముందు గోపీచంద్ చేసిన రణం, లౌక్యం చిత్రాల తరహాలో కంప్లీట్ ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. కేవలం మాస్ ఆడియెన్సే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరించేలా ఉంది. కొందరు ఫ్యాన్స్ అయితే ‘వింటేజ్ శ్రీను వైట్ల ఈజ్ బ్యాక్’ అని అంటున్నారు. మొత్తానికి ఈ సినిమాతో గోపీచంద్, శ్రీను వైట్ల ఇద్దరూ చాలాకాలం తర్వాత హిట్ అందుకున్నారనే చెప్పొచ్చు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.