కింగ్ ఆఫ్ కంటెంట్ శ్రీవిష్ణు, ట్యాలెంటెడ్ డైరెక్టర్ హసిత్ గోలి లేటెస్ట్ కంటెంట్ ప్యాక్డ్ బ్లాక్ బస్టర్ ‘శ్వాగ్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రీతూ వర్మ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్ ఇతర కీలక పాత్రల్లో పోషించారు. అక్టోబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అలాగే విమర్శకులు ప్రశంసలు అందుకొని కంటెంట్ ప్యాక్డ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ నేపధ్యంలో మేకర్స్ గ్రాండ్ గా ఆడియన్స్ విక్టరీ శ్వాగ్ సక్సెస్ మీట్ నిర్వహించారు. మూవీ టీం అంతా పాల్గొన్న ఈ సక్సెస్ మీట్ గ్రాండ్ గా జరిగింది. ఈ ఆడియన్స్ విక్టరీ శ్వాగ్ సక్సెస్ మీట్లో హీరో శ్రీవిష్ణు తన అనుభవాలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా శ్రీవిష్ణు ఏమన్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.. “ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్ గారికి, నాకోసం ఇలాంటి మంచి కథ రాసిన హసిత్ గోలికి, సినిమా కోసం పనిచేసిన టీంలో ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. హసిత్ నా ఫ్యాన్. నాకు ఒక తమ్ముడిలా. నాకు ఇంత మంచి కథ, పాత్రలు రాసినందుకు థాంక్యూ. రీతూ వర్మ, దక్ష, మీరా జాస్మిన్, సునీల్ గారు అందరూ చాలా అద్భుతంగా చేశారు.”
“కొన్ని సినిమాలు బాగున్నాయి అనిపిస్తాయి. ఇంకొన్ని సినిమాలు అంత లేదులే అనిపిస్తాయి. కానీ కొన్ని సినిమాలు చూసి వచ్చిన తర్వాత కూడా మనల్ని వెంటాడుతాయి. దాని గురించి ఒక డిస్కషన్ జరిగేలా చేస్తాయి. అలాంటి సినిమానే స్వాగ్. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. డిస్కషన్స్ నుంచి చాలా వాలిడ్ పాయింట్స్ వస్తాయి. ఇవన్నీ కూడా మేము ఫస్ట్ డే నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం. సినిమా చూసినోళ్లు 90% సాటిస్ఫై అయ్యారు. 10% కొంచెం కాంప్లెక్స్ ఉంది అని ఫీల్ అయ్యారని హసిత్ చెప్పాడు.”
“అయితే కొత్తగా ఏదైనా ప్రయత్నించినప్పుడు ఇలాంటి చిన్న చిన్నవి ఉంటాయి. శ్వాగ్ సినిమాని ఎవ్వరూ కూడా బాలేదని అనలేదు. దానికి మీ అందరికి కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నేను చేసిన చాలా సినిమాలకి ఇప్పటికీ ప్రశంసలు వస్తుంటాయి. ఆ సినిమా ప్రశంసలు ఆగిపోయి, ఈ సినిమా ప్రశంసలు మొదలవుతాయని ఆశిస్తున్నాను. ఈ ప్రశంసలు కొనసాగుతూనే ఉంటాయని నమ్ముతున్నాను. ఈ సినిమా చూసే కొద్ది కొత్త విషయాలు తెలుస్తుంటాయి. ఏ ఉద్దేశంతో ఈ సినిమా తీశామో అర్థం అవుతుంది.”
“మమ్మల్ని గెలిపించిన తెలుగు ప్రేక్షకుల్ని గెలిపించడానికి ఈ సినిమా చేస్తున్నానని మొదటి నుంచి చెప్తున్నాను. నిజంగానే మీరంతా గెలిచారు. మీరు గెలిచి మమ్మల్ని గెలిపించారు. ఇలాంటి రిస్కులు, కొత్త కథలు ట్రై చేయకపోతే నెక్స్ట్ జనరేషన్‌ని మనం ఇన్స్పైర్ చేయలేం. ఏమీ లేని నాకు ఇంత గుర్తింపు ఇచ్చారు. తెలుగు ఆడియన్స్ రుణం తీర్చుకోవాలి. ఆ రుణం తీర్చే ప్రాసెస్‌లో ఇలాంటి గొప్ప కథలు చేయడానికి ప్రయత్నిస్తుంటాను. ఆడియన్స్ నేను చేసిన ప్రతి క్యారెక్టర్ని చాలా ఎంజాయ్ చేస్తున్నారు.”
“ఈసారి రాస్తే దీన్ని కొట్టేది రాయాలి. రాస్తాడనే నమ్మకం కూడా ఉంది. విశ్వ గారు మాకు ఇంత ఫ్రీడమ్ ఇవ్వకపోతే ఇలాంటి కథను చేయలేం. పీపుల్ మీడియా టీమ్ అందరికీ థాంక్యు. సినిమాని జనాల్లోకి తీసుకెళ్లి మీడియా మిత్రులు అందరికీ థాంక్యూ. ఆ 10% కూడా కంగారు పడకండి. నెక్స్ట్ సినిమాకి వడ్డీతో సహా ఇచ్చేస్తాను. లేకపోతే లావు అయిపోతాను (నవ్వుతూ) అందరికీ థాంక్యూ” అని అన్నారు హీరో శ్రీవిష్ణు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























