మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల ఫస్ట్ కొలాబరేషన్‌లో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘విశ్వం’. కావ్యా థాపర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ హై బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌పై టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తుండగా.. దోనేపూడి చక్రపాణి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమా నుండి ఇప్పటివరకూ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్‌తో చిత్రంపై హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. దసరా కానుకగా అక్టోబర్ 11న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా గ్రాండ్‌గా ప్రీరిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. చిత్ర యూనిట్ అంతా పాల్గొన్న ఈ వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా డైరెక్టర్ శ్రీను వైట్ల చిత్ర విశేషాలు వివరించారు.
శ్రీను వైట్ల ఏమన్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.. “అందరికీ నమస్కారం. విశ్వం నిజంగా బ్యూటిఫుల్ జర్నీ, చాలా ఎంజాయ్ చేశాను. ఈ బ్యూటిఫుల్ జర్నీలో నా బెస్ట్ కో ప్యాసింజర్ గోపీచంద్ గారు. మా ఇద్దరితో ఈ జర్నీ స్టార్ట్ అయింది. తర్వాత వేణు గారు వచ్చారు. ఆ తర్వాత విశ్వ ప్రసాద్ గారు వచ్చారు. గోపి మోహన్, భాను, నందు, ప్రవీణ్ వర్మ ఈ నలుగురు నేను అనుకున్న కథని అనుకున్నట్లు రావడానికి చాలా కష్టపడి పని చేశారు. ఈ సినిమాలో టెక్నీషియన్స్ అంతా నా మీద ఇష్టంతో ప్రేమతో పని చేశారు.”
“ఐ యాం 100% కాన్ఫిడెంట్ ఈ సినిమా మీ అందరిని ఎంటర్‌టైన్ చేస్తుంది. రెండున్నర గంటల్లో ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టదు. చాలా ఎంగేజింగ్‌గా హిలేరియస్‌గా వుంటుంది. ఇన్ని వేరియేషన్స్ ఉన్న సినిమాకి రీ రికార్డింగ్ చేయడం చాలా కష్టం. చేతన్ ఫెంటాస్టిక్ మ్యూజిక్ ఇచ్చాడు. తను ఎఫర్ట్ లెస్‌గా చాలా బాగా చేశాడు. గుహన్ నాకు ఒక యంగర్ బ్రదర్‌లా ఉంటూ చాలా సపోర్ట్ చేశారు. ఎడిటర్ అమర్ ఈ సినిమా హిట్ కావాలని అనుక్షణం పనిచేసాడు.”
“అలాగే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నేను అనుకున్నది అనుకున్నట్లుగా తీయడానికి సపోర్ట్ చేసిన విశ్వ ప్రసాద్ గారికి, వేణుగారికి థాంక్స్. కావ్య పర్ఫామెన్స్‌తో పాటు డాన్సులు కూడా చాలా ఎనర్జిటిక్‌గా చేసింది. అనీషా, ప్రగతి గారు, నరేష్ గారు, సునీల్, వెన్నెల, కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, రాహుల్ రామకృష్ణ.. యాక్టర్స్ అందరు కూడా ఎంతో ఇష్టపడి చాలా ప్రేమతో పనిచేశారు.”
“ఏ సినిమా అయినా డైరెక్టర్ అనుకున్నది అనుకున్నట్లు తీయాలంటే హీరో సపోర్టు ఉండాలి. గోపి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఇచ్చాడు. ఆయన వల్లే నేను అనుకున్నది అనుకున్నట్లుగా తీయగలిగాను. డెఫినెట్ గా ఈ సినిమా నాకు గోపికి చాలా పెద్ద హిట్ అవుతుంది. ఈ హిట్ తో దసరాని చాలా ఎంజాయ్ చేయబోతున్నాం. అందరికీ హ్యాపీ దసరా. థాంక్యూ సో మచ్” అని అన్నారు డైరెక్టర్ శ్రీను వైట్ల.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























