ఈవారం 6 సినిమాలు రానున్నాయి

6 noted films releasing this week

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దేవర హవా కొనసాగుతుంది.లాస్ట్ వీక్ వచ్చిన సినిమాలు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయ్యాయి.ఇక ఈవారం ఆరు నోటెడ్ సినిమాలు విడుదలవుతున్నాయి.అందులో మూడు స్ట్రెయిట్ తెలుగు సినిమాలు కాగా మరో మూడు డబ్బింగ్ సినిమాలు వున్నాయి.అవేంటో చూద్దాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన వేట్టయన్ మొదటగా బరిలోకి దిగుతుంది.ఈ గురువారం విడుదలవుతుంది.తెలుగులోకూడా అదే టైటిల్ తో వస్తుంది.ఇందులో రానా ,ఫహద్ ఫాజిల్,రితిక సింగ్ కీలక పాత్రలు చేశారు.అనిరుధ్ సంగీతం అడ్వాంటేజ్ కానుంది.టీజీ జ్ఞానవేల్ డైరెక్ట్ చేయగా లైకా నిర్మించింది.ఈసినిమాపై మంచి అంచనాలు వున్నాయి.

ఇక నెక్స్ట్ డే గోపిచంద్ -శ్రీను వైట్ల కాంబినేషన్ లో వస్తున్న విశ్వం థియేటర్లలోకి రానుంది.ఈసినిమా విజయం ఈ ఇద్దరికి కీలకం కానుంది.అయితే వీరికి కావాల్సిన సక్సెస్ విశ్వం ఇస్తుందని ఫుల్ కాన్ఫిడెంట్ గా వున్నారు.ట్రైలర్ ప్రామిసింగ్ గా అనిపించింది.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ,చిత్రాలయలం స్టూడియోస్ నిర్మించాయి.

అదే రోజు సుధీర్ బాబు మా నాన్న సూపర్ హీరో కూడా విడుదలవుతుంది.ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.దాంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ప్రమోషన్స్ కూడా బాగానే చేస్తున్నారు.ఇక అదే రోజు ఆలియా భట్ నటించిన జిగ్రా,కన్నడ సినిమా మార్టిన్ కూడా తెలుగులో విడుదలవుతున్నాయి.

ఇక శనివారం యంగ్ హీరో సుహాస్ నటించిన జనక అయితే గనక థియేటర్లలోకి రానుంది.ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యే కంటెంట్ కావడం అలాగే దిల్ రాజు బ్యానర్ నుండి వస్తుండడంతో ఈసినిమాపై కూడా అంచనాలు వున్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.