8 వసంతాలు.. శుద్ధి అయోధ్య క్యారక్టర్ టీజర్ అప్‌డేట్

Shuddhi Ayodhya Character Teaser Update From 8 Vasanthalu

టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన‌ర్‌పై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవి శంకర్ ‘8 వసంతాలు’ అనే ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీని గ్రాండ్‌గా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాది ప్రేమికుల రోజున ఈ ప్రాజెక్ట్‌ని అనౌన్స్ చేసిన సందర్భంగా.. ‘365 రోజులను అంకెలతో కొలిస్తే ఒక సంవత్సరం, అదే అనుభవాలతో కొలిస్తే.. ఒక వసంతం’ అంటూ 8 వసంతాలు మూవీ కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

యంగ్ డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ‘మ్యాడ్’ ఫేమ్ అనంతిక సనీల్‌ కుమార్‌కు హీరోయిన్‌గా నటిస్తోంది. ‘శుద్ది అయోధ్య’ అనే పాత్రలో ఆమె నటిస్తుండగా.. ఇందుకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ని ఇప్పటికే రిలీజ్ చేశారు మేకర్స్. ఆ పోస్ట‌ర్‌లో ఆమె క‌దిలే క‌విత్వం అంటూ క్యాప్ష‌న్ కూడా ఇచ్చారు.

శుద్ధి అయోధ్యగా సనీల్‌ కుమార్‌ ఈ గెటప్‌లో కళ్లకు కాటుక, చెవులకు పోగులు, ముక్కుకు రింగుతో.. అందంగా నవ్వుతూ చెమ్మగిల్లిన కళ్లతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. కాగా 19ఏళ్ల వయసు నుంచి 27ఏళ్ల వయసు వరకూ.. 8 ఏళ్ల ఆమె ప్రయాణమే ప్రధాన ఇతివృత్తంగా రూపొందుతోన్న భావోద్వేగాల సమాహారంగా ఈ 8 వసంతాలు రూపొందుతోంది.

ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ ఒక కీలక అప్‌డేట్ అందించింది. శుద్ధి అయోధ్యగా నటిస్తున్న అనంతిక పాత్రకు సంబంధించి ఒక ప్రత్యేక టీజర్‌ను విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. విజయ దశమి పండుగను పురస్కరించుకుని ఈ స్పెషల్ టీజర్‌ను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా సోమవారం వెల్లడించింది.

కాగా 8 వసంతాలు చిత్రంలో హను రెడ్డి, రవితేజ దుగ్గిరాల, సంజన, కన్నా, స్వరాజ్ రెబ్బాప్రగడ, సమీర కిషోర్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. విశ్వనాథ రెడ్డి కెమెరా అందిస్తుండగా.. సూపర్ హిట్ మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం సమకూరుస్తున్నారు. అరవింద్ మూలే ప్రొడక్షన్ డిజైనర్ కాగా, శశాంక్ మాలి ఎడిటర్‌గా, బాబాసాయి కుమార్ మామిడిపల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ సినిమా ఇప్పటికే ఊటీ, హైదరాబాద్, కన్యాకుమారి వంటి పలు ప్రదేశాల్లో షూటింగ్ జరుపుకుంది. ఇక తదుపరి షెడ్యూల్‌ను కాశ్మీర్, ఆగ్రా, వారణాసి తదితర ప్రాంతాలలో ప్లాన్ చేశారు మేకర్స్. ఈ షెడ్యూల్‌తో షూటింగ్ ముగియనుండగా.. ఎడిటింగ్ వర్క్ సహా మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను ముగించుకుని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.