వెర్సటైల్ యాక్టర్ సుహాస్, సంగీర్తన హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘జనక అయితే గనక’. శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. సందీప్ రెడ్డి బండ్ల డైరక్ట్ చేశారు. ఇప్పటి వరకు చిత్రం నుంచి రిలీజ్ చేసిన పోస్టర్లు, పాటలు, టీజర్లు ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా జనక అయితే గనక సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ రీసెంట్గా మీడియా ముందుకు వచ్చింది. ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ దిల్ రాజు సహా సినిమాలో పనిచేసిన నటీనటులు, దర్శకుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన పలు విశేషాలు వివరించారు.
ఈ సందర్భంగా హీరో సుహాస్ మాట్లాడుతూ.. ‘మా చిత్రం అక్టోబర్ 12న రాబోతోంది. అందరూ చూడండి. ఏ ఒక్కర్నీ కూడా నిరాశ పర్చదు. ఇప్పటి వరకు సినిమా చూసిన వాళ్లంతా కూడా బాగుందని చెబుతున్నారు. ఆడియెన్స్ ఎలాంటి రియాక్షన్స్ ఇస్తారా? అని అక్టోబర్ 12 కోసం వెయిట్ చేస్తున్నాను. ఓవర్సీస్లో మా చిత్రం అక్టోబర్ 10న విడుదల కాబోతోంది” అని చెప్పారు.
అలాగే ఈ మూవీ డైరెక్టర్ సందీప్ రెడ్డి బండ్ల మాట్లాడుతూ.. ‘దిల్ రాజు, హర్షిత్ గారికి, సుహాస్ గారికి థాంక్స్. మా టీజర్‌ను లాంచ్ చేసిన ప్రభాస్ గారికి థాంక్స్. నా ఫేవరేట్ నా పెళ్లాం పాట బాగా వైరల్ అయింది. సుమ, రాజీవ్ కనకాల, ఆట సందీప్ రీల్స్ చేశాక మరింత వైరల్ అయింది. సినిమా కూడా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను” అని తెలిపారు.
ఇక ‘జనక అయితే గనక’ సినిమాలో కథానాయికగా నటించిన హీరోయిన్ సంగీర్తన మాట్లాడుతూ.. “మా చిత్రం అక్టోబర్ 12న రాబోతోంది. అందరూ తప్పకుండా చూడండి. మా టీజర్, ట్రైలర్లకు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం కూడా అందరికీ నచ్చుతుంది” అని అన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























