వెర్సటైల్ యాక్టర్ సుహాస్, సంగీర్తన హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘జనక అయితే గనక’. శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. సందీప్ రెడ్డి బండ్ల డైరక్ట్ చేశారు. ఇప్పటి వరకు చిత్రం నుంచి రిలీజ్ చేసిన పోస్టర్లు, పాటలు, టీజర్లు ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా జనక అయితే గనక సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ రీసెంట్గా మీడియా ముందుకు వచ్చింది. ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ దిల్ రాజు సహా సినిమాలో పనిచేసిన నటీనటులు, దర్శకుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన పలు విశేషాలు వివరించారు.
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ‘ఇప్పటికే మా సినిమాను చాలా మందికి షో వేశాం. ఆ రియాక్షన్సే ఇప్పుడు మీడియాకు చూపించాను. త్వరలోనే మీడియాకి కూడా షో వేస్తాను. మీడియా ముందుగా షో వేయాలంటే కాస్త భయంగానే ఉంటుంది. కానీ మంచి సినిమాను తీశాం కాబట్టి.. మీడియాకు ముందుగానే షో వేస్తాను. సినిమా హిట్ అయితే అందరికీ సంతోషంగా ఉంటుంది. అక్టోబర్ 6న విజయవాడలో పబ్లిక్ షో వేస్తున్నాం. 8వ తేదీని తిరుపతిలో షో వేస్తున్నాం.” అని తెలిపారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “హ్యాపీ డేస్, శతమానం భవతి చిత్రాలు ఓవర్సీస్లో ముందుగా రిలీజ్ చేశాను. ఆ సెంటిమెంట్‌తోనే ఇప్పుడు కూడా ఈ మూవీని ముందుగా అంటే అక్టోబర్ 10న ఓవర్సీస్లో రిలీజ్ చేస్తున్నాను. 11న ఇక్కడ ప్రీమియర్లు వేసి.. 12న గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నాం. నాన్ థియేట్రికల్ బిజినెస్ పూర్తయింది. డిజిటల్, హిందీ డబ్బింగ్, ఓటీటీ ఇలా అన్నీ కూడా పూర్తయ్యాయి. మా సినిమా పూర్తి వినోదాత్మకంగా సాగుతుంది. అందరినీ అలరించేలా ఈ చిత్రం ఉంటుంది” అని అన్నారు నిర్మాత దిల్ రాజు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























