స్వాగ్‌లో శ్రీవిష్ణు క్యారెక్టరైజేషన్స్ మెస్మరైజ్ చేస్తాయి

Producer TG Vishwa Prasad Reveals Interesting Facts About Swag

కింగ్ ఆఫ్ కంటెంట్ శ్రీవిష్ణు, ట్యాలెంటెడ్ డైరెక్టర్ హసిత్ గోలి అప్ కమింగ్ హిలేరియస్ ఎంటర్ టైనర్ ‘స్వాగ్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మూవీపై హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. స్వాగ్ అక్టోబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపధ్యంలో చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

స్వాగ్ ఎలాంటి కథ?

శ్రీవిష్ణు గారు అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్స్ అలాగే కంటెంట్ బేస్డ్ సినిమాలు చేస్తున్నారు. స్వాగ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ హైలెట్‌గా వుంటాయి. మొత్తం నాలుగు క్యారెక్టర్స్ చేస్తున్నారు. దాదాపు తొమ్మిది గెటప్స్‌లో ఆయన్ని ఆడియన్స్ చూడబోతున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఎక్స్‌ట్రార్డినరీ ఎమోషనల్ మెసేజ్ వుంటుంది.

డైరెక్టర్ హసిత్ గోలి గురించి?

హసిత్ గోలికి ఎక్స్‌ట్రార్డినరీ రైటింగ్ స్కిల్ వుంది. ఆయన ఎంటర్‌టైన్‌మెంట్‌ని చాలా ఈజీగా రాస్తారు. స్వాగ్ లో ఎమోషనల్ మెసేజ్ వున్న కంటెంట్ చేశారు. ఇలాంటి కథలు చాలా రేర్‌గా వస్తాయి. ఇందులో సాలిడ్ మెసేజ్ వుంటుంది. జనరేషన్స్‌లో మారుతూ వస్తున్న జెండర్ డామినెన్స్ ఇందులో చాలా ఇంట్రస్టింగ్‌గా ప్రజెంట్ చేశారు హసిత్.

ఇది నాలుగు తరాల కథ కదా.. ఎలాంటి స్క్రీన్ ప్లే వుంటుంది?

డైరెక్టర్ ఈ కథని అందరికీ అర్ధమయ్యే స్క్రీన్ ప్లేతో డిజైన్ చేశారు. స్క్రీన్ ప్లే చాలా ఎంగేజింగ్‌గా వుంటుంది. ఫస్ట్ హాఫ్‍లో క్యారెక్టర్స్‌ని ఎస్టాబ్లెస్ చేసే విధానం చాలా ఎంటర్‌టైనింగ్‌గా వుంటుంది. ఇంటర్వెల్ వరకూ థ్రిల్ అండ్ సర్‌ప్రైజ్ ఫ్యాక్టర్ కంటిన్యూ అవుతుంది. మెయిన్ స్టొరీ రివిల్ అయిన తర్వాత ఇంటర్వెల్ నుంచి చాలా మంచి ఎమోషన్ వుంటుంది.

మేము కమర్శియల్‌తో పాటు కంటెంట్ బేస్డ్ సినిమాలూ చేస్తున్నాము. మా గూఢచారి, ఓ బేబీ, కార్తికేయ 2 ఎలాంటి సక్సెస్ ఇచ్చాయో స్వాగ్ కూడా అలా గుర్తుండిపోయే సినిమా అవుతుందనే నమ్మకం వుంది. కమల్ హాసన్ గారి ‘ఇంద్రుడు చంద్రుడు’, ‘మైఖేల్ మదన్ కామరాజు’.. ఈలాంటి క్యారెక్టరైజేషన్ లోని మ్యాజిక్ స్వాగ్‌లో వుంటుంది. శ్రీవిష్ణు అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైన్ చేస్తారు. హసిత్ చాలా అద్భుతంగా సినిమాని మలిచాడు.

స్వాగ్ సినిమా విషయంలో మీకు ఛాలెంజ్‌గా అనిపించిన అంశం ఏమిటి?

ప్రొడక్షన్ సైడ్ ఎలాంటి ఛాలెంజ్ లేదండి. క్రియేటివ్ సైడ్ మాత్రం ఛాలెంజే. ఈ సబ్జెక్ట్‌ని 2గంటల 36నిమిషాల్లో చెప్పడం అనేది టఫ్ జాబ్. అన్ని క్యారెక్టర్స్‌ని డైరెక్టర్ చాలా అద్భుతంగా హ్యాండిల్ చేసి ఎంగేజింగ్‌గా చెప్పారు.

మీరా జాస్మిన్ గారి క్యారెక్టర్ ఎలా వుండబోతోంది?

ఇందులో రెండు భవభూతి పాత్రలు వుంటాయి. కరెంట్ జనరేషన్ క్యారెక్టర్‌కి ఆమె వైఫ్‍గా కనిపిస్తారు, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఆమె క్యారెక్టర్‌లో చాలా మంచి ఎమోషన్ వుంటుంది.

ఈ సినిమాకి చాలా సెట్స్ వేశారు కదా? ఆ ఎక్స్ పీరియన్స్ గురించి?

స్వాగ్ లాంటి స్పాన్ వున్న కథని ఈ కాస్ట్‌లో చేయడం అంత ఈజీ కాదు. ఈ కాస్ట్ నార్మల్ మార్కెట్ ఎవైలబుల్ కాస్ట్‌కి టూ టైమ్స్. క్యాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చేశాం.

కన్నడలో ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నారని విన్నాం?

ప్రస్తుతం డిస్ట్రిబ్యుషన్ చేస్తున్నాం. 2025లో దాదాపు నాలుగు సినిమాలు లాంచ్ చేస్తాం. ప్రీ వర్క్ జరుగుతోంది. నెక్స్ట్ మంత్ అనౌన్స్‌మెంట్స్ వుంటాయి.

వెబ్ ప్రాజెక్ట్స్ గురించి?

‘హరికథ’ అనే ప్రాజెక్ట్ చేస్తున్నాం. అది హాట్ స్టార్‌లో రాబోతోంది. అలాగే ‘న్యూసెన్స్ 2’ చేస్తున్నాం. మరిన్ని వెబ్ సిరిస్‌లు చేయాలనే ప్లానింగ్స్ వున్నాయి.

రాజాసాబ్ షూటింగ్ ఎక్కడి వరకూ వచ్చింది?

నవంబర్‌లో షూటింగ్ ఫినిష్ చేయాలని భావిస్తున్నాం.

మీ ప్రొడక్షన్‌లో 50 మైల్ స్టోన్ మూవీ గురించి స్పెషల్‌గా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా?

ప్రొడక్షన్ నెంబర్ 50 నాకు తెలుసు. రిలీజ్ 50 ఏమిటనేది నాకు తెలీదు (నవ్వుతూ). 50వ సినిమా కోసం పర్టిక్యులర్‌గా ప్లానింగ్ ఏమీ లేదు.

ఆడియన్స్ స్వాగ్ నుంచి ఎలాంటి ఎలిమెంట్స్ ఆశించవచ్చు?

ఫస్ట్ హాఫ్ ఎంటర్‌టైనింగ్ విత్ లాట్ అఫ్ సస్పెన్స్, క్యూరియాసిటీ. సెకండ్ హాఫ్ డిఫరెంట్ ఎమోషన్. సినిమా చూసి బయటికి వచ్చినప్పుడు ఆడియన్స్ వెరీ న్యూ ఎక్స్ పీరియన్స్‌ని ఫీల్ అవుతారు.

ఆల్ ది బెస్ట్..

థాంక్ యూ.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.