రామ్‌ చరణ్‌కు అరుదైన గౌరవం

Global Star Ram Charan's Wax Statute to be Unveiled Soon at Madame Tussauds

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌. ఈ చిత్రంతో గ్లోబల్ స్టార్‌గా మారిన ఆయనకు తాజాగా మరో అరుదైన గౌరవం లభించింది. ప్రతిష్టాత్మక మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో రామ్‌ చరణ్‌ మైనపు బొమ్మను ఏర్పాటు చేయబోతున్నారు. చరణ్‌తోపాటు ఆయన పెంపుడు శునకం రైమీ యొక్క మైనపు ప్రతిమ కూడా ఈ విగ్రహాంలో భాగం కావడం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీనికి సంబంధించిన ఫొటోషూట్‌ ఇప్పటికే పూర్తవగా.. ఈ మేరకు మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం వారు ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. త్వరలోనే సింగపూర్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో రామ్‌ చరణ్‌, రైమీ వాక్స్ స్టాట్యూ కొలువుదీరనుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో బాగా వైరల్‌ అవుతున్నది.

ప్రస్తుతం ఈ విగ్రహాన్ని రూపొందించే పనిలో తమ నిపుణుల బృందం నిమగ్నమై ఉందని, త్వరలోనే ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని ఐఫా వేదికగా టూస్సాడ్స్‌ టీమ్‌ ప్రకటించింది. ఇక ఈ సందర్భంగా హీరో రామ్‌చరణ్‌ స్పందిస్తూ, టుస్సాడ్స్ కుటుంబంలో తానూ భాగం కావడం గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు.

కాగా టుస్సాడ్స్ మ్యూజియం, ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులర్ అయిన సెలబ్రిటీల మైనపు బొమ్మలను గత కొన్నేళ్లుగా పలు దేశాల్లోని తమ మ్యూజియమ్స్‌లో ఏర్పాటు చేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు భారతీయ నటీనటుల విగ్రహాలను అక్కడ ప్రతిస్టహించింది.

బాలీవుడ్‌ స్టార్ హీరోలు అమితాబ్‌ బచ్చన్, అమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, హృతిక్‌ రోషన్‌ మైనపు బొమ్మలను ఇతర దేశాల మ్యూజియమ్స్‌లో ఏర్పాటు చేశారు. అలాగే తెలుగు హీరోలలో మహేష్ బాబు, ప్రభాస్‌, అల్లు అర్జున్‌ ఇప్పటికే ఆ గౌరవాన్ని దక్కించుకున్నారు. ఇప్పుడు వారి సరసన రామ్‌చరణ్‌ కూడా చేరబోతున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.