సీఎం చంద్రబాబును కలిసిన మోహన్ బాబు, విష్ణు మంచు

Manchu Mohan Babu and Vishnu Presented Rs. 25 Lakh Cheque to AP CM Chandrababu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కురిసిన ఎడతెరిపిలేని వర్షాలు, దరిమిలా వచ్చిన భారీ వరదలతో ఎంతోమంది ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈ వరదల వల్ల భారీ ఆస్తి మరియు ప్రాణనష్టం సంభవించింది. ఈ నేపథ్యంలో చిత్ర పరిశ్రమ తరపున పలువురు ప్రముఖులు వరద బాధిత ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి అండగా నిలబడ్డారు. దీనిలో భాగంగా తమ బాధ్యతగా భారీ విరాళాలను ప్రకటించి మంచి మనస్సు చాటుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ క్రమంలో నటుడు మంచు మోహన్ బాబు మరియు ఆయన తనయుడు, ‘మా’ అధ్యక్షుడు, హీరో విష్ణు మంచు ఏపీలోని వరద బాధితులకు సాయం అందించేందుకు ముందుకొచ్చారు. వారి సహాయార్ధం తమ వంతు సాయంగా 25 లక్షల రూపాయలను అందించారు. ఈ మేరకు తాజాగా మోహన్ బాబు, విష్ణు మంచు ఇద్దరూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలుసుకుని ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అందజేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు వీరిని అభినందించారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.