‘గేమ్‌ఛేంజర్’ సెకండ్ సింగిల్ ప్రోమో అప్‌డేట్

Game Changer Second Single Raa Macha Macha Promo Update

గ్లోబల్ స్టార్‌ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘గేమ్ ఛేంజర్’. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, జయరామ్, సునీల్‌, అంజలి, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సోషల్ మెసేజ్‍తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. గేమ్ ఛేంజర్ బ్యాక్‍ గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్ పనులు అక్టోబర్ 1వ తేదీన మొదలవనున్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ఫస్ట్ సింగిల్ ‘జరగండి’ సహా టోటల్ ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ రెస్పాన్స్ అందుకుంది.

ఈ నేపథ్యంలో తాజాగా గేమ్ ఛేంజర్ సెకండ్ సింగిల్‌పై చిత్ర యూనిట్ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచింది. ‘రా మచ్చా మచ్చా’ అంటూ సాగే ఈ పాట ప్రోమో అప్‌డేట్ సెప్టెంబ‌ర్ 28న వెల్లడించనున్న‌ట్టు తెలిపింది. అయితే ఈ మూవీ నుంచి ఏదయినా అప్‌డేట్ వచ్చి చాలాకాలం అవ్వడంతో చెర్రీ ఫ్యాన్స్ ఈ సాంగ్ కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

పాన్ ఇండియా సినిమాగా రూపొందుతోన్న గేమ్ ఛేంజర్ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యానర్‌పై టాలీవుడ్ అగ్ర నిర్మాతలు దిల్ రాజు, శిరీష్‌లు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. డిసెంబర్ 20వ తేదీన క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా ఓవర్సీస్‌ రిలీజ్ రైట్స్‌ను ‘ఫార్స్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్’ సొంతం చేసుకుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.