ఆచార్య తరువాత స్టార్ డైరెక్టర్ కొరటాల శివ నుండి వస్తున్న సినిమా దేవర.ఆచార్య ముందు వరకు శివ తీసిన సినిమాలు అన్ని బ్లాక్ బాస్టర్స్ అయ్యాయి కానీ ఆచార్య డిజాస్టర్ అవ్వడంతో కొరటాల మొదటి సారి భారీ ప్లాప్ రుచి చూశాడు.ఇక ఇప్పుడు దేవరతో బ్లాక్ బాస్టర్ కొట్టి తానేంటో నిరూపించుకోవాల్సివుంది. మరో మూడు రోజుల్లో ఈసినిమా థియేటర్లోకి రానుంది.దేవర నుండి వచ్చిన సాంగ్స్,ట్రైలర్స్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుని అంచనాలు పెంచేశాయి.తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్ లో క్రేజ్ మాములుగాలేదు.మొదటి రోజు 100కోట్లు కొట్టేలానే వుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక దేవర ప్రమోషన్స్ లో భాగంగా కొరటాల శివ ఈరోజు మీడియా తో మాట్లాడారు.ఇందులో అల్లు అర్జున్ కి చెప్పిన కథనే దేవర గా తీశారా అని అడిగిన ప్రశ్నకు కొరటాల సమాధానం ఇచ్చారు.దేవర ఎన్టీఆర్ ను ద్రుష్టిలో పెట్టుకొని రాసింది.అల్లు అర్జున్ కు చెప్పిన కథ ఇది కాదు అది వేరే.దేవర నరేషన్ కే నాలుగు గంటలు పట్టింది అందుకే రెండు భాగాలుగా తీసుకొస్తున్నాం అని అన్నారు.
ఇక నిజానికి అయితే కొరటాల శివ డైరెక్షన్ లో అల్లు అర్జున్ 21వ సినిమా చేయాల్సింది.2021 లో థియేటర్లోకి తీసుకరావాలి అనుకున్నారు. అల్లు అర్జున్,కొరటాల శివ ఇద్దరు సముద్రం దగ్గర నిలబడి సముద్రాన్ని చూస్తూ వున్న పోస్టర్ తో అనౌన్స్ మెంట్ చేశారు.ఇందులో చిన్న బోట్ కూడా ఉంటుంది.అయితే ఈసినిమా పట్టాలెక్కలేదు.ఆ తరువాత అల్లు అర్జున్ పుష్ప చేయగా కొరటాల ఆచార్య తీశారు.మరి వీరి కాంబోలో ఫ్యూచర్ లోనైనా సినిమా వస్తుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























