దేవర వార్ ఫైర్ లాంటి సినిమా, చాలా పెద్ద హిట్ కొట్టాలి – కార్తి

Devara Should be a Huge Hit, Says Hero Karthi in Sathyam Sundaram Pre Release Event

ప్రముఖ తమిళ స్టార్ హీరో కార్తీ, సీనియర్ నటుడు అరవింద్ స్వామి లీడ్ రోల్స్‌లో రాబోతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘సత్యం సుందరం’. ’96’ ఫేమ్ సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రముఖ కోలీవుడ్ స్టార్ కపుల్ సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా సెప్టెంబర్ 28న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ తాజాగా ప్రీరిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. మాస్ కా దాస్ విశ్వక్ సేన్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ స్పెషల్ గెస్ట్‌లుగా పాల్గొన్న ఈ వేడుకు చాలా గ్రాండ్‌గా జరిగింది.

ఇక ప్రీరిలీజ్ ఈవెంట్‌లో హీరో కార్తీ సత్యం సుందరం చిత్ర విశేషాలు వివరించారు. ఈ సందర్భంగా టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో వస్తోన్న లాటెట్స్ మూవీ ‘దేవర’ సినిమా సూపర్ హిట్ అవ్వాలని ఆకాంక్షించారు. సత్యం సుందరం కంటే ఒక్కరోజు ముందు దేవర విడుదలవుతోన్న విషయం తెలిసిందే.

కార్తి ఏమన్నారో ఆయన మాటల్లోనే చూద్దాం.. “అందరికీ నమస్కారం. ఐ లవ్ యు బ్రదర్స్. మీ ప్రేమకి థాంక్ యూ. మీరు లేకపోతే నేను లేను. ఈ ఈవెంట్‌కి స్పెషల్ గెస్ట్ లుగా వచ్చిన విశ్వక్, ప్రశాంత్ వర్మ, సురేష్ బాబు గారు, సునీల్ గారికి అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇప్పుడు తెలుగు సినిమాలంటే ‘బాహుబలి’ లాంటి బిగ్ స్కేల్ సినిమాలు ఐడెంటిటీ. కానీ కొన్ని రోజుల క్రితం ఇంకో ఐడెంటిటీ కూడా ఉండేది. కే విశ్వనాథ్ గారి సినిమాలు, పెద్దవంశీ గారి సినిమాలు, వసంత కోకిల లాంటి సినిమాలు హార్ట్ కి క్లోజ్ అయిన ఎన్నో సినిమాలు ఇక్కడనుంచి వచ్చాయి.”

“మా సత్యం సుందరం 28న వస్తోంది. 27న మా బ్రదర్ తారక్ నటించిన ‘దేవర’ సినిమా రాబోతుంది. ఈ సందర్భంగా తారక్ కి, తారక్ ఫ్యాన్స్ కి ఆల్ ది వెరీ బెస్ట్. చాలా పెద్ద హిట్ కొట్టాలి. మా రెండు సినిమాలకు పోలిక లేదు. ఎందుకంటే, దేవర వార్ ఫైర్ లాంటి పెద్ద సినిమా. మాది సిరిమల్లె చెట్టు లాంటి బ్యూటీఫుల్ ఫిల్మ్. ఈ సినిమాని చాలా మనసుపెట్టి చేశాం. ఊపిరి నాకు చాలా స్పెషల్ ఫిలిం. ఆ సినిమా తర్వాత సత్యం సుందరం చాలా స్పెషల్. తప్పకుండా అందరికీ నచ్చుతుంది. అందరూ వచ్చి సినిమాని చూడాలని కోరుకుంటున్నాను” అని చెప్పారు హీరో కార్తి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.