మా ఇద్దరిలో ఎవరు లేకపోయినా ఈ సినిమా లేదు

Hero Karthi Reveals Interesting Facts About Sathyam Sundaram Movie

హీరో కార్తీ, అరవింద్ స్వామి లీడ్ రోల్స్‌లో రాబోతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘సత్యం సుందరం’. 96 ఫేమ్ సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 28న ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో హీరో కార్తి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సత్యం సుందరం ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయ్యింది ? కథ ఎలా వుండబోతోంది?

96 సినిమా తర్వాత డైరెక్టర్ ప్రేమ్ కుమార్ చేస్తున్న సినిమా ఇది. 96 కి చాలా ఫాలోయింగ్ వవుంది. దాదాపు ఆరేళ్ళ తర్వాత ఆయన నుంచి వస్తున్న సినిమా. రెండేళ్ళ క్రితం నా కోసం ప్రేమ్ దగ్గర ఓ కథ వుందని నా ఫ్రెండ్ చెప్పాడు. కానీ ఆయన నాకు చెప్పడానికి భయపడుతున్నారు. నేనే మెసేజ్ చేశాను.

అప్పుడాయన ఈ స్క్రిప్ట్ ని చదవమని ఇచ్చారు. స్క్రిప్ట్ ని ఒక అద్భుతమైన నవల రాశారు. మొత్తం చదివాను. చాలా చోట్ల ఆనందంలో కన్నీళ్ళు వచ్చాయి. ఇలాంటి కథ ఎలా రాస్తారని అనిపించింది. నాకు కే విశ్వనాధ్ గారి సినిమాలు ఇష్టం. కానీ ఇప్పుడు అలాంటి కథలు రావడం లేదు.

ఈ కథ చదివినప్పుడు అలాంటి ఒక మంచి సినిమా అవుతుందనిపించింది. చాలా రేర్ స్క్రిప్ట్. డిఫినెట్‌గా చేయాలనిపించింది. మనలోని చాలా ప్రశ్నలకి సమాధానం ఇచ్చే కథ ఇది.

అన్నయ్యకి కథ చదవమని చెప్పాను. అన్నయ్యకి చాలా నచ్చింది. నీకు మాత్రమే ఇలాంటి కథలు ఎలా వస్తున్నాయి అన్నారు. ఖచ్చితంగా చేద్దామని చెప్పారు. బ్రదర్స్ లాంటి రెండు క్యారెక్టర్స్ మధ్య నడిచే కథ ఇది.

ప్రతి ఒక్కరూ చూడాలనుకునే సినిమా. అరవింద్ స్వామి గారు ఇందులో క్యారెక్టర్‌కి పర్ఫెక్ట్. ఆయన చదివి చాలా ఎమోషనల్ అయ్యారు. ఈ కథని చదివినవారంతా ప్రాజెక్ట్‌లో పార్ట్ అవ్వాలని ఆసక్తి చూపారు. 96లానే ఇది ఒక్క నైట్‌లో జరిగే కథ. ఫ్యామిలీ ఆడియన్స్‌కి కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.

సాగర సంగమం సినిమా చూసినప్పుడు ఎలాంటి ఒక అద్భుతమైన అనుభూతి కలుగుతుందో సత్యం సుందరంలో కూడా లాంటి ఓ మంచి అనుభూతిని ప్రేక్షకులు ఆస్వాదిస్తారు. విశ్వనాథ్ గారి సినిమాలు కమర్షియల్ బ్లాక్ బస్టర్సే. ఇది కూడా అలాంటి సినిమానే.

ఈ కథలో మిమ్మల్ని ఆకట్టుకున్న కోర్ ఎలిమెంట్ ఏమిటి?

అన్ కండీషనల్ లవ్. మనకి ఫ్యామిలీ నుంచే అన్ కండీషనల్ లవ్ దొరుకుతుంది. అలాంటి అన్ కండీషనల్ లవ్‌ని చూపించే సినిమా ఇది. మన కల్చర్, రూట్స్‌కి సంబధించిన స్టొరీ .

చాలా మంచి హ్యుమర్ ఫీలింగ్ వున్న ఎమోషనల్ కంటెంట్. చాలా చోట్ల హ్యాపీ టియర్స్ వస్తాయి. ఊపిరి సినిమా చూసినప్పుడు చాలా బ్యూటీఫుల్ ఎమోషన్ వుంటుంది కదా.. అలాంటి హ్యాపీ ఎమోషన్ వున్న కథ.

ఇలాంటి కథ అరవింద్ స్వామి గారి నిజ జీవితంలో జరిగిందని తెలిసి చాలా సర్‌ప్రైజ్ అయ్యాను. ఆయన గ్రామంలోనే పుట్టి పెరిగారు. ఈ సినిమాలో అరవింద్ గారి క్యారెక్టర్‌లో ఆయన్ని తప్పితే మరొకని ఊహించలేం. మా ఇద్దరి క్యారెక్టర్స్ మధ్య చాలా మంచి కెమిస్ట్రీ వుంటుంది.

తెలుగులో కంటే తమిళ్ ఒక రోజు ముందు రావడానికి కారణం?

తెలుగు దేవర వుంది. అది చాలా పెద్ద సినిమా. మా సినిమా రోజు తర్వాత రావడం బెటర్. రెండు చాలా డిఫరెంట్ ఫిలిమ్స్. అది ఒక వార్‌లా వుంటుంది. మాది సీతమ్మ వాకిట్లో లాంటి సినిమా (నవ్వుతూ).

మీ క్యారెక్టర్ ఎలా వుంటుంది?

ఒక చిన్న పల్లెటూరిలో శారీ షాప్ నడిపే ఇన్నోసెంట్ లాంటి క్యారెక్టర్. తనకి లైఫ్ మీద ఎలాంటి అంచనాలు వుండవు. చాలా చలాకీగా మాట్లాడే క్యారెక్టర్. చాలా సింపుల్ అండ్ బ్యూటీఫుల్ క్యారెక్టర్.

గోవింద్ వసంత్ మ్యూజిక్ గురించి?

గోవింద్ వసంత్ మంచి కంపోజర్. ఈ కథ విని.. ఈ సినిమా నా ట్యాలెంట్‌ని ఛాలెంజ్ చేస్తుందని అన్నారు. ప్రతి సాంగ్ మీనింగ్ ఫుల్‌గా వుంటుంది. నేపథ్య సంగీతం హంటింగ్‌గా వుంటుంది. మ్యూజిక్ మన చైల్డ్ డేస్‌కి తీసుకెళుతుంది.

ఇందులో డైలాగులు కూడా కొత్తగా నేచురల్‌గా వుంటాయి. కెమెరా మూమెంట్స్ కూడా చాలా ఆర్గానిక్‌గా వుంటాయి. ఒక లైఫ్‌లా కనిపిస్తుంది. రియల్ ఎమోషన్స్‌ని ఆడియన్స్ తెరపై ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీతో వచ్చి ఈ సినిమా చూస్తే ఇంకా ఆస్వాదిస్తారు.

సి ప్రేమ్ కుమార్‌తో వర్క్ చేయడం ఎలా అనిపించింది?

ఆయన చాలా ప్లానింగ్‌తో వుండే డైరెక్టర్. ప్రతిది రెడీగా ఉంచుతారు. ఆయనకి గొప్ప అండర్ స్టాండింగ్ వున్న డైరెక్టర్. అద్భుతమైన మాటలు రాశారు. ఈ కథ చదివినప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉండేదో యాక్ట్ చేసినప్పుడు కూడా అదే ఫీలింగ్ వచ్చింది.

సూర్య గారు ఈ ప్రాజెక్ట్‌లో ఇన్వాల్ అయ్యారు?

సినిమా ప్రోడ్యుస్ చేయడం వరకే కానీ అన్నయ్య ఇన్వాల్ అవ్వరు. ఒక రోజు మాత్రం రాత్రి షూటింగ్‌కి రోలెక్స్ వచ్చారు (నవ్వుతూ). అందరికీ తెలిసిపోయి జనం వచ్చేశారు. కాసేపు షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చి మళ్ళీ చేశాం (నవ్వుతూ).

సూర్య నా మొదటి సినిమా చూసి నన్ను హాగ్ చేసుకున్నారు. మళ్ళీ ఈ సినిమా చూసి చాలా ప్రౌడ్‌గా హాగ్ చేసుకున్నారు. అద్భుతంగా పెర్ఫార్మ్ చేశానని కాంప్లిమెంట్ ఇచ్చారు.

ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ తెలుగులో రిలీజ్ చేయడం గురించి?

సునీల్ గారు ఈ సినిమా చేయాలని అడిగనప్పుడు చాలా సర్‌ప్రైజ్ అయ్యాను. ఆయన రిలీజ్ చేయడం చాలా హ్యాపీగా వుంది. ఆయన జడ్జిమెంట్‌పై నాకు నమ్మకం వుంది.

డిల్లి, రోలెక్స్ పేస్ అఫ్ ఎప్పుడు?

నెక్స్ట్ ఇయర్ వుంటుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.