సత్యం సుందరం ట్రైలర్‌ చూశారా?

Karthi and Arvind Swami's Sathyam Sundaram Trailer Released

హీరో కార్తీ, అరవింద్ స్వామి లీడ్ రోల్స్‌లో రాబోతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘సత్యం సుందరం’. 96 ఫేమ్ సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపధ్యంలో సెప్టెంబర్ 28న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ రిలీజ్ చేస్తున్నారు. విడుదల సమయం దగ్గర పడటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. దీనిలో భాగంగా తాజాగా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్‌లో కార్తి, అరవింద్ స్వామి నటన హైలైట్ అని చెప్పొచ్చు.

కార్తి, అరవింద స్వామి.. బావ,బావమరుదులుగా నటించారు. ఇద్దరి మధ్య అనుబంధం, భావోద్వేగపూరిత సన్నివేశాలతో సినిమా ఉండబోతున్నట్టు ట్రైలర్‌తో క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్‌. ఈ నేపథ్యంలో వచ్చే కథతో ఫన్‌ ఎలిమెంట్స్‌తో పాటు సీరియస్ సన్నివేశాలతో సినిమా సాగనున్నట్టు ట్రైలర్‌ చెప్పకనే చెబుతోంది. మొత్తానికి ఈ మూవీ ట్రైలర్ సరదాగా ఎమోషనల్‍గా హృదయాలను హత్తుకునేలా ఉంది. ఈ ట్రైలర్‌ మీరు చేశారా? లేకపోతే దీనిపై మీరూ ఓ లుక్కేయండి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.