టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం లభించింది. అయితే చిరంజీవి అంటే.. ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది ఆయన డ్యాన్సులే. ఆయన డ్యాన్సులకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుందంటే అతిశయోక్తి లేదు. విభిన్నమైన డ్యాన్సులు, తనకే సాధ్యమైన స్టైల్‍తో చిరంజీవి కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక నాలుగున్నర దశాబ్దాలకు పైగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఆయన ఇప్పటివరకు ఎన్నో రికార్డులు, అవార్డులు సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలో తాజాగా చిరంజీవి మరో విశిష్ట గౌరవం అందుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాత గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో చిరంజీవి స్థానం దక్కించుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. ఇప్పటి వరకు 156 సినిమాలు చేసిన చిరంజీవి, వీటిలో 537 పాటల్లో నర్తించి ఆడియెన్స్ ను అలరించారు. అయితే ఈ 537 పాటల్లో ఆయన 24 వేలకు పైగా స్టెప్పులు వేయడం విశేషం. దీంతో తాజాగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో చిరంజీవి పేరు చేరింది.
ఈ నేపథ్యంలో గిన్నిస్ బుక్ సంస్థ ఆదివారం హైదరాబాద్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా గిన్నిస్‌వరల్డ్ రికార్డ్ ప్రతినిథుల సమక్షంలో చిరంజీవికి ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్‌ఖాన్ ఈ అవార్డును చిరుకి ప్రదానం చేశారు. ఇక ఈ అరుదైన గౌరవం అందుకున్న చిరంజీవికి చిత్ర పరిశ్రమనుండి పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలియజేస్తున్నారు.
ఇక మెగాస్టార్ సినిమాల విషయానికొస్తే.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న మోస్ట్ ఎవైటెడ్ సోషియో-ఫాంటసీ ఎంటర్‌టైనర్ ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట మల్లిడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తుండగా.. కునాల్ కపూర్, సురభి, ఈషా చావ్లా, ఆషికా రంగనాథ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
సోషియో ఫాంటసీగా రూపొందుతోన్న ఈ చిత్రంలో ఆస్కార్ విజేత ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తుండగా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ UV క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాతలు విక్రమ్, వంశీ, ప్రమోద్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న విశ్వంభర 2025లో జనవరి 10 ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























