టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కథానాయకుడిగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘రాబిన్‌హుడ్’. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఇంతకుముందు వీరిద్దరి కాంబోలో ‘భీష్మ’ అనే సినిమా వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇందులో నితిన్ సరసన లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇదిలావుంటే, ప్రస్తుతం నిర్మాణదశలో ఉన్న ఈ సినిమా నుంచి రిలీజైన టైటిల్ గ్లింప్స్ సహా అన్ని ప్రచార చిత్రాలకి మూవీ లవర్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ అందించింది.
టాలీవుడ్ స్టార్ హీరో నితిన్ అప్ కమింగ్ యాక్షన్, హీస్ట్ కామెడీ ఎంటర్ టైనర్ ‘రాబిన్‌హుడ్’ షూటింగ్ షెడ్యూల్ ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ప్రారంభమైంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. లీడ్ పెయిర్‌తో డ్యూయెట్ సాంగ్ షూట్ ని టీమ్ ప్రారంభించింది.
ఇక ఈ పాటను కృష్ణకాంత్ లిరిక్స్ తో జివి ప్రకాష్ ఆకట్టుకునే విధంగా కంపోజ్ చేశారు. నితిన్, శ్రీలీల డాజ్లింగ్ కెమిస్ట్రీ హైలెట్ గా వుండబోతోంది. మెల్‌బోర్న్ లో అద్భుతమైన ప్రదేశాలలో షూట్ చేస్తున్న ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ సాంగ్ తో పాటు బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్‌తో సహా ప్రధాన నటీనటులతో కూడిన ముఖ్యమైన టాకీ పార్ట్ ని చిత్రీకరించనున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్‌లు అత్యున్నత స్థాయి నిర్మాణ, సాంకేతిక విలువలతో నిర్మిస్తున్న ఈ చిత్రానికి కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ కంపోజర్ జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా, రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. కాగా డిసెంబర్ 20న రాబిన్‌హుడ్ సినిమా థియేటర్లలోకి రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























