మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ రోల్ పోషించగా, కొరటాల శివ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ ‘దేవర’. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ మోస్ట్ అవైటెడ్ మూవీలో తారక్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ కథానాయికగా కనిపించనుంది. ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 27న దేవర చిత్రం తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో దేవర యూనిట్‌కి శుభవార్త అందింది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ సినిమా విడుదల విషయంలో అక్కడి ప్రభుత్వం నిర్మాతల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించింది. మూవీ రిలీజైన నాటినుంచి రెండు వారాలపాటు టికెట్ల రేటు పెంపునకు ఆమోదం తెలిపింది. అంతేకాకుండా అదనపు షోలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది.
దీనిప్రకారం.. మల్టిప్లెక్స్ థియేటర్లలో టికెట్ రేట్స్ రూ.135 పెరగనున్నాయి. అలాగే సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అప్పర్ క్లాస్ రూ.110, లోయర్ క్లాస్ రూ.60 గా పెరిగాయి. ఇక ఇదిలావుంటే, మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా దేవర సినిమా టికెట్ రేట్ల పెంపుకు ఆమోదం తెలిపినట్టు సమాచారం. దీంతో దేవరకు టాక్ ఏమాత్రం కొంచెం పాజిటివ్‌గా వచ్చినా.. వసూళ్ళలో దుమ్ము రేపడం ఖాయం.
కాగా దేవర చిత్రంలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ‘భైరా’ అనే విలన్ పాత్రలో కనిపించనుండగా.. అలాగే ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, అజయ్, గెటప్ శీను తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె నిర్మించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























