సినీ రంగంలో తిరుగులేని కథానాయకుడిగా పేరు సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత కొన్ని నెలలుగా రాజకీయాలతో బిజీగా ఉంటూ వస్తున్నారు. అయితే ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిసినందున ఇకపై ఆయన సినిమాలపై దృష్టి సారిస్తున్నారు. త్వరలోనే పెండింగ్‍లో చిత్రాల షూటింగ్స్‌లో పాల్గొంటానని పవన్ రీసెంట్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘హరి హరవీరమల్లు’, ‘ఓజీ’ సినిమాలు రూపొందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఎప్పటినుంచి షూటింగులకు అందుబాటులో ఉంటారనే విషయమై సంప్రదించేందుకు ఆయా చిత్రాల నిర్మాతలు పవన్‌ను కలుసుకుంటున్నారు. దీనిలో భాగంగా తాజాగా హరిహర వీరమల్లు టీమ్ పవన్ కళ్యాణ్‌ను కలుసుకుంది.
ఈ మేరకు ఏపీ డిప్యూటీ సీఎం ఆఫీసుకి వెళ్లిన వారు అక్కడ పవర్ స్టార్‌తో భేటీ అయ్యారు. త్వరలోనే హరిహర వీరమల్లు షూటింగ్‌లో పవన్ పాల్గొననున్నట్టు సమాచారం. ఈ మేరకు ప్రొడ్యూసర్స్‌కు ఆయన సూచనప్రాయంగా వెల్లడించారు. కాగా సెప్టెంబర్ 23న హాలీవుడ్ లెజెండ్ నిక్ పావెల్ స్టంట్ డైరెక్షన్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో ఈ ఎపిక్ యాక్షన్ సాగా షూటింగ్ తిరిగి ప్రారంభమవుతుందని యూనిట్ తెలిపింది.
ఇక హరిహర వీరమల్లు సినిమా విషయానికొస్తే.. పవర్ స్టార్ ఫస్ట్ టైం ఒక వారియర్‌గా కనిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్‌కు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ ఎఎం. రత్నం తన మెగా సూర్యా ప్రొడక్షన్ బ్యానర్‌పై ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జ్ఞాన శేఖర్ వి.ఎస్. సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























